ప్రధాని దీక్షపై అగ్ర నేతల సీరియస్…?

ప్రధాని నరేంద్ర మోడీ దీక్షపై ఆ పార్టీ అగ్రనేతలే ఆగ్రహం వ్యక్తం చేసారా…? కుక్క తోకను ఊపాలి గాని తోక కుక్కను ఊపకూడదు అనే సామెత మాదిరి బిజెపిని ప్రధాని ఊపడం ఏంటి అని..?ఇప్పుడు ఇదే బిజెపి అగ్ర నేతలను ఆగ్రహానికి గురి చేస్తుంది. పార్టీ ఎప్పుడు ఒక వ్యక్తి చేతుల్లో ఉన్న సందర్భాలు మనం చూడలేదు అంటూ ఆగ్రహంగా ఉన్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అసలు ప్రధానికి పార్టీపై అంత పట్టు అవసరం లేదనే అభిప్రాయంలో బిజెపి పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది…

బిజెపి అనేది వ్యక్తి చుట్టునో కుటుంబం చుట్టునో తిరిగే పార్టీ కాదు…కాని ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూనే బిజెపి పార్టీ మొత్తం తిరుగుతుంది. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే పార్టీ నిర్మాణంలో కీలకంగా ఉన్న అద్వాని , మురళి మనోహర్ జోషి , రాజనాద్ సింగ్ వంటి నేతలు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఎలాంటి పట్టు లేకుండా ఉండిపోవడమే…అసలు రాజకీయం నేర్పిన వాళ్ళనే ప్రధాని అవమానించడం లేదా వారిని విస్మరించడం చేస్తూ వస్తుండటంతో ఆలోచనలో పడిపోయింది అగ్ర నాయకత్వం..
త్రిపుర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన ప్రధాని అద్వానీని అవమానించడం దేశం మొత్తం చూసింది. ఈ పరిణామం బిజెపి పెద్దలను కంట తడి పెట్టేలా చేసింది. అలాగే అంత మద్దతు ఉండి కూడా అవిశ్వాసానికి అన్నాడిఎంకేని అడ్డం పెట్టుకుని బయటపడటం ఏంటి..? అనే ప్రశ్న బిజెపి పెద్దలను కలవరానికి గురి చేస్తుంది. అసలు పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు సిద్దంగా ఉన్నప్పుడు ప్రధాని వెళ్లి నేను అవిశ్వాసానికి సిద్దం చర్చకు వచ్చేలా సహకరించండని ఎందుకు ప్రకటన చెయ్యలేదు…ఇప్పుడు ఎందుకు దీక్ష చేస్తున్నారు. అనేది బిజెపి పెద్దలను చికాకు పెడుతున్న అంశం. పార్టీలోని సీనియర్ నేతలు అందరు దీనిపై సమావేశమై వచ్చే ఎన్నికల్లో ప్రధానిని పక్కన పెట్టి మరో నేతను ఎన్నుకోవాలని ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఇరాకటంలో పడేస్తున్నా వారిపై చట్టాన్ని అడ్డం పెట్టుకుని కక్ష తీర్చుకుంటూ ఉంటారు. ఇది మనం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. యుపియే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ వచ్చాయి..అలాగే ఎన్డియే అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సంఘటనలను మనం చూసాం చూస్తూనే ఉన్నాం…వారి దారిలోకి తెచ్చుకోవడమ లేక జైలుకి పంపడమా ఈ రెండీటిల్లో ఒకటే జరుగుతుంది.
యుపియే అధికారంలో ఉన్నప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి , జగన్ , కనిమోలి ఇలా ఎందరో నేతలు ఊచలు లెక్కపెట్టిన సందర్భాలు మనం చూసాం. ఇక ఎన్డియే అధికారంలోకి వచ్చాక శశికళ , బీహార్ మాజీ సిఎం లాలు ప్రసాద్ యాదవ్ సహా కొందరు నేతలు ఊచలు లేక్కపెడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి చేసారని ఆరోపిస్తున్న బిజెపి నేతలు ఎందుకు చంద్రబాబుపై కేసులు పెట్టడం లేదు..? దాని వెనుక ఉన్న మతలబు ఏంటి..?
ఇప్పుడు ఇవి ఎవరికి అంతుబట్టని ప్రశ్నలు. చంద్రబాబు ప్రభుత్వ౦ యుసీలు ఇవ్వడం లేదని విపక్ష వైకాపా సహా బిజెపి నేతలు ఆరోపించారు. అంటే అవినీతి జరిగినట్టే కదా…? పట్టిసీమలో అవినీతి జరిగింది అని ఆరోపించిన వాళ్ళు ఎందుకు తమ కిందే ఉండే సిబిఐని అడ్డ౦ పెట్టుకుని చంద్రబాబుపై కేసులు పెట్టడం లేదు…? ఢిల్లీ వెళ్లి మోడిని విమర్శించారు చంద్రబాబు…పార్లమెంట్ నుంచి ప్రధాని నివాసం వరకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేసారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.. దీనికి కారణం ఏంటి…? లోగుట్టు మోడిషాలకు ఎరుక.