రాష్ట్రం లో చీమ చిటుక్కుమన్నా  మోడీ వైపే ఎందుకు చూస్తున్నారు :  బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ 

 BJP MLC Madhav , Trendingandhra

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఐటీదాడులు సంచలం సృష్టిస్తున్నాయి… ఐతే ఇందులో ఎక్కువ గా టీడీపీ నాయకుల పై ఆదాయపు  పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరియు ఇప్పటికే కొంతమంది టీడీపీ నాయకులు తమ పై కేంద్ర లోని బీజేపీ మరియు జగన్ పవన్ లు కలిసి కుట్ర పన్నుతున్నారని , కోట్లకి కోట్లు అక్రమాస్తులను కూడబెట్టిన వారిని వదిలిపెట్టి ఏ పాపం ఎరుగని తమపై ఇలాంటి చర్యలకి పాల్పడడం అమానుషం అని వాపోతున్నారు . అంతేగాక మరి కొంత మంది అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ని సమర్థవంతం ఎదుర్కునే దమ్ము లేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని , మరియు  ఇది కేవలం కక్ష్య సాధింపు చర్య అని ఎన్నికల ముందు తమ పార్టీ కి చెడ్డ పేరు రావాలని కొందరు నాయకులు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలా చేస్తున్నారని, టీడీపీ నాయకులూ  ఆరోపణలు  చేస్తున్నారు ..
 
mlc madhav , TrendingAndhra
 

అయితే తాజాగా  ఈ వ్యాఖ్యల పై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ఐటీ దాడులకు కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు. మరియు  ఇప్పటి వరకూ ఐటీ దాడులు జరిగినటువంటి  కంపెనీలన్నీ ఇంతకు ముందే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అంతేగాక ఇలా ప్రత్యేకం గా టీడీపీ పార్టీ ఒక్కటే కాదని అవినీతి కి పాల్పడే ప్రతి ఒక్కరూ తప్పకుండ ఐటీ దాడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొంతమంది అవగాహన లేని నాయకులు రాష్ట్రం లో ఐటీ సోదాలు జరిగితే రాష్ట్రానికి వచ్చే  పెట్టుబడులు ఆగిపోతాయని అంటున్నారని , అందులో ఎటువంటి వాస్తవం లేదని , అసలు ఐటీ సోదాలకీ పెట్టుబడులకీ ఎటువంటిసంబంధం లేదని  తెలిపారు.