కేసీఆర్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు… టీఆర్ఎస్ కొంప మునిగేది అందుకేనన్న బాబు

chandrababu hot comments on kcr,trendingandhra

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో రాజ‌కీయ‌ వాతావ‌ర‌ణం రసవత్తరంగా సాగుతోంది. ఒకరికొకరు షాకులిస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఒక‌వైపు టీఆర్ఎస్ మ‌రోవైపు మ‌హాకూట‌మి ఒక‌రి పై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నారు. ఎప్పుడైతే మ‌హాకూట‌మిలో భాగంగా టీడీపీ పొత్తు పెట్టుకుందో అప్ప‌టి నుండి తెలంగాణ ఎన్నిక‌ల స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. దీంతో టీఆర్ఎస్ నేత‌లు చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వారికి ధీటుగానే కౌంట‌ర్ ఇస్తున్నారు.

chandrababu hot comments on kcr,trendingandhra
ఈ నేప‌ధ్యంలో తాజాగా చంద్ర‌బాబు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎప్ నేత‌లు ఆయా నియోజ‌క వ‌ర్గాల్లోకి ప్ర‌చారానికి వెళితే.. అక్క‌డి ప్ర‌జ‌లు నుండి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురౌతోంద‌ని.. సామాన్య ప్ర‌జ‌లు టీఆర్ఎస్ నేత‌ల‌ను చీత్కరించుకుంటున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఏదో చేస్తార‌ని అధికారం క‌ట్ట‌బెడితే కేసీఆర్‌తో స‌హా టీఆర్ఎస్ నేత‌లందరూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా సొంత‌ప‌నులు చేసుకున్నార‌ని, దీంతో ఇప్పుడు ఓట్లు కోసం ప్ర‌జ‌లు దగ్గ‌ర‌కు వెళితే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. కేసీఆర్ అతి విశ్వాస‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ కొంప ముంచుతుంద‌ని, ఇదంతా కేసీఆర్ స్వ‌యంకృతాప‌రాధ‌మే అని చంద్ర‌బాబు మండి ప‌డ్డారు. ఇక మ‌రోసారి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం గ‌ద్దె ఎక్క‌కుండా.. మ‌హాకూట‌మి విజ‌యానికి త‌లా ఒక చెయ్యి వేయాల‌ని చంద్ర‌బాబు కోరారు. మ‌రి చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై టీఆర్ఎస్ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.