కాంగ్రెస్ లో చేరిన చంద్రబాబు …చరిత్ర లో నిలిచిపోయే ఘట్టం ..!

Chandrababu joining the Congress ... to stay in history ..!,trendingandhra

రాహుల్‌ గాంధీ, తాను కలిసి పాల్గొన్న బహిరంగ సభలు చరిత్రలో నిలిచిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగానే చరిత్రలో నిలిచిపోయే సన్నివేశాలు నిన్న జరిగిన సభ లో చోటు చేసుకున్నాయి. సనత్‌నగర్ బహిరంగ సభలో రాహుల్‌తో పాటు చంద్రబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ సాగించిన 37 ఏళ్ల పోరాటానికి ముగింపు అన్నట్టుగా కాంగ్రెస్‌ కండువాను చంద్రబాబు కప్పుకున్నారు.

రాహుల్‌ గాంధీ సమక్షంలోనే , కాంగ్రెస్ మహిళా నేత గంగాభవాని వేదిక మీద చంద్రబాబు మెడలో కాంగ్రెస్‌ కండువా కప్పారు. చంద్రబాబు కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా చెప్పకుండా దర్జాగా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన సమయంలో మామపైనే పోటీ చేస్తానని కాంగ్రెస్‌ లో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే వెంటనే టీడీపీలో చేరారు. ఆ తర్వాత దశాబ్దాల తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు . ఈ సన్నివేశాన్ని చరిత్ర లో నిలిచి పోయే ఘట్టంగా చెప్పవచ్చు .