కోడి కత్తె కాదు ఏ కత్తి నన్ను ఏమి చేయలేదు …!

chandrababu naidu hot comments on narendra modi,chandrababu naidu hot comments,chandrababu naidu,nchandrababu naidu,andhra pradesh politics,trendingandhra

కత్తి తమను ఏం చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కోడి కత్తిని ప్రధాని మోదీ కత్తిగా వినియోగించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవాచేశారు. ఇక్కడ ఏమి జరక్కుండానే గవర్నర్ నరసింహన్, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీయల్ నరసింహరావు డీజీపీ ఠాగూర్‌తో ఏవేవో మాట్లాడుతారని చెప్పారు.

తెలంగాణలో మహాకూటమి పెడితే అక్కడి నాయకుడితో పాటు మోదీకి వణుకు పుట్టిందన్నారు. ప్రధాని కోడి కత్తి పార్టీతో జత కట్టాలని చూస్తున్నారని, కోడి కత్తి విషయంలో అనవసర రాద్ధాంతం చేసి పరువు పోగొట్టుకున్నారని చెప్పారు. కోడి కత్తి పార్టీని ఎవరూ నమ్మవద్దని సూచించారు.

దేశ భవిష్యత్తు బాగుండాలంటే వీరోచితంగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. అందుకే అవసరం అనుకున్నప్పుడు ఎవరితో అయినా కలవాలని, రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనం ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని మోదీ చేతిలో పెట్టాలని చూస్తుందని, వారి మోసాలను గుర్తించి ప్రశ్నించినందుకే టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్ని దాడులు చేసినా, భయపెట్టాలని చూసినా తాను భయపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు.