రేవంత్‌రెడ్డి పై ఐటీ దాడి …….కేసు వివరాలు ఇవే

it raids on revanth reddy house behind case details , revanth reddy , it raids , trendingandhra

తన ఇంటితో పాటు తన బంధువుల ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని అర్థంతరంగా ముగించుకుని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి తనిఖీలు జరిగిన తీరును పరిశీలించారు. ఐటీ సోదాలపై అధికారులతో రేవంత్ మాట్లాడారు. అధికారులు ఆయనకు నోటీలు అందించారు. గురువారం ఉదయం నుంచి సోదాలు చేసిన ఐటీ రేవంత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

బ్లాక్ మనీ, ఇన్ కం ట్యాక్స్ చట్టం 2015, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ ఆక్ట్ 1988, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసులు నమోదు చేశారు.

2014 ఫిబ్రవరి 25న సింగపూర్‌లోని బహుళ అంతస్తుల అమ్మకంలో 20 లక్షల సింగపూర్ డాలర్లు, 25.02.2014న మురళీ రఘువరణ్ దగ్గర నుంచి రేవంత్‌రెడ్డి రూ.60 లక్షలు పొందినట్లు గుర్తించారు. ఎన్నికల అఫిడవిట్‌లో, ఐటీ రిటర్న్స్‌లో రేవంత్‌ సమాచారం ఇవ్వలేదు. లెక్కలేనంత డబ్బు పెట్టి… వివిధ ఖాతాల ద్వారా సింగపూర్, మలేసియాలలో ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. యాంటి కరెప్షన్ యాక్ట్ సెక్షన్ 1988 ఉల్లంఘించారని అభియోగం మోపారు. అనుచరులు. బినామీలు, బంధువుల పేర్లతో షెల్ కంపెనీలు సృష్టించి… కేవలం రేవంత్ రెడ్డి లబ్ధి పొందినట్లు ఆరోపిస్తున్నారు. తన కుటుంబ సభ్యుల పేరు మీద వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్లు, బిల్డింగ్‌లు ఉన్నట్లు ఐటీ గుర్తించింది. హోదాను ఉపయోగించి అక్రమ పద్ధతిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపిస్తున్నారు అధికారులు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే కొండగల్‌లో రేవంత్‌రెడ్డి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చిన ఆస్తుల వివరాల ప్రకారం ఐటీ రిటర్న్స్ సరిగా లేనట్లు అధికారులు గుర్తించారు. రాజకీయ అండ ఉపయోగించి వ్యక్తిగత లబ్ధి, భారీగా ఆస్తులు సేకరించినట్లు ఆరోపిస్తోంది ఐటీ. 2014లో నల్లధనంతో మలేషియాలోని ఆస్తులు కొనుగోలు చేసి వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా తిరిగి వైట్ మనీ పొందినట్లు, 25.02.2014న రేవంత్‌రెడ్డి హాంకాంగ్ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 60 లక్షల మలేషియన్ రింగెట్స్‌ని జమ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ సొమ్మును కౌలాంలంపూర్ వాసి రఘువరణ్ మురళికి ఆర్‌బీహెచ్ బ్యాంక్ ద్వారా రేవంత్‌కు డబ్బు అందినట్లు ఆరోపిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన సొమ్ము ఇండియన్ కరెన్సీలో రూ. 10కోట్లకు పైగా విలువ చేస్తున్నట్లు అభియోగం మోపారు ఐటీ అధికారులు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హవాల రూపంలో దుబాయ్ నుంచి సొమ్ము పొందినట్లు గుర్తించారు. నెక్సెస్ ఫీడ్ కంపెనీ నుంచి రేవంత్‌రెడ్డి ఖరీదైన ఫోర్స్‌ కారు నెంబర్ ఏపీ 37 సీక్యూ 0999 పొందినట్లు గుర్తించారు. ఫెమా రెగ్యులేషన్ యాక్ట్, బినామీ లావాదేవీలు, లోన్స్ డైవర్టెడ్… మనీ ల్యాండరింగ్ యాక్టివిటీస్ ఉల్లఘించినట్లు అధికారులు గుర్తించారు.