బిగ్ బ్రేకింగ్…..విజయవాడకు భారీగా చేరుకున్న ఐటీ బృందాలు….టార్గెట్ వారేనా …!

IT raids , Vijayawada it raids , TrendingAndhra

ఇటీవల తెలంగాణలోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు అయ్యింది. గురువారం రాత్రి భారీగా ఐటీ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం దాడులకు సిద్ధంగా ఉండాలని పోలీసు అధికారులను ఐటీ బృందాలు కోరడం జరిగింది.

అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ దాడులు రాజకీయంగానే జరుగుతాయని తెలుస్తోంది. కాగా.. ఈ రోజు ఉదయం పలువురు రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఏ రాజకీయ నేత ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తారో అనే విషయం మాత్రం తెలియరాలేదు. ”

భారీగా బృందాలు విజయవాడకు చేరుకోవడంతో స్థానికంగా ఉన్న నేతలు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏకకాలంలో పలువురు రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి మరి ఏపీ లో ఎవరికీ మూడిందో …