చంద్రబాబు పై జోకులేసిన కేసీఆర్ …. అసలు విషయం అదే

kcr comments on chandrababu naidu,trendingandhra

గులాబీ దళపతి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో జోకులేస్తున్నారు. ముఖ్యంగా ఆ వేసే జోకులు కూడా చంద్రబాబు మీదే వెయ్యటం గమనార్హం. తిట్టినా చంద్రబాబే, జోకులేసినా చంద్రబాబే… అసలు విషయం చెప్పాలంటే ఆయన భయం చంద్రబాబే… ఆయన టార్గెట్ చంద్రబాబే…. మరి చంద్రబాబు పార్టీ కి అంత సత్తా ఉందా… అధికారం దక్కించుకునే సీన్ లేకుండా చేసినా చంద్రబాబు సమయం చూసి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుండీ ఇంకా కోలుకొని కేసీఆర్ ఎక్కడ సభల్లో అయినా బాబు జపమే చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ చంద్రబాబుపై పంచ్ లు వేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ జోకులపై జోకులేశారు. తెలంగాణ ఆచారాలు చంద్రబాబుకు పెద్దగా తెలియవన్నారు. తాను చేతికి కట్టుకున్న దట్టి గురించి ప్రజలకు వివరించారు కేసీఆర్. తన చేతికి ముస్లిం సోదరులు కట్టింది దట్టీ కాదని ఇమామ్‌ జమీన్‌ అన్నారు. క్షేమంగా వెళ్లి లాభంగా రా అని బంధువులు, పెద్దలు దీవించి కట్టే పట్టీ పవిత్రమైనదని ఇమామ్ జమీన్ అని చెప్పుకొచ్చారు. ముస్లిం లను తనవైపుకు తిప్పుకోతానికి కేసీఆర్ చాలా బాగా చక్కని కథలు చెప్పారు. ఇమామ్ జమీన్ గురించి ఆంధ్రావాళ్లకు తెలియదని పట్టి అని రాస్తారంటూ విమర్శించారు. తనకు ముస్లిం సోదరులు ఇమామ్ జమీన్ కట్టినప్పటి నుంచి దేశమంతా కడుతున్నారని అన్నారు. అంతకు ముందు ఎవరూ కట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.

kcr comments on chandrababu naidu,trendingandhra
గతంలో చంద్రబాబు సీఎంగా, తాను మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లామని రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పాలని సూచించానని చెప్పిన కేసీఆర్
అయితే చంద్రబాబు తాను చెప్పింది మరిచిపోయారని, ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పాల్సింది పోయి ఊద్‌ ముబారక్‌ అని చెప్పారని చెప్పుకొచ్చారు. దీంతో సభలో అంతానవ్వేశారు. దీంతో కేసీఆర్ కూడా తనకు నవ్వొస్తుందంటూ తెగ నవ్వుకున్నారు. ఎన్నికల ప్రచార సభలో తాము చేసింది చెయ్యబోయే అభివృద్ధి చెప్పాల్సిన చోట కేసీఆర్ తన స్థాయి మరచి పక్క రాష్ట్ర సీఎం మీద పంచ్ వేశారు. తెలంగాణ రీతి, రివాజు, కల్చర్‌ చంద్రబాబుకు తెలియదని కేసీఆర్ విమర్శించారు. ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. అలా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ సభ బాబు టార్గెట్ గా సాగింది. మొత్తానికి చంద్రబాబు కేసీఆర్ కు కునుకు లేకుండా చేస్తున్నారని ఆయన ఆ ఆందోళనను అధిగమించటానికి ఏదేదో చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు తెలంగాణా ప్రజలు.