కోదండ రామ్ జనగామ సీటు త్యాగం… రీజన్ ఇదే

latest news on kodandaram,trendingandhra

కోదండ రామ్ ను ఒప్పించటంలో చివరి నిముషంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. ఆయన పోటీ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఆయన పెద్దరికం చూపారు. పొంనలను పో… నువ్వే పోటీ చెయ్యవయ్యా అంటూ జనగామ పంపించారు. ఎట్టకేలకు జనగామ జగడం తేలిపోయింది . ఎన్నికల పోరు నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తప్పుకున్నారు. జనగామ టికెట్ ను ఆయన కాంగ్రెసు నేత పొన్నాల లక్ష్మయ్యకు త్యాగం చేశారు.
కోదండరామ్ ఈ వ్యవహారంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా చర్చలు జరిపారు. ఆయన్ని పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. ఆయన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఒక పక్క బీసీ నేత సీటు కోదండ రాం తీసుకున్నాడు అన్న ఆరోపణలు కూడా కోదండ రాం కు ఇష్టం లేక చివరకు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు కోదండరామ్ అంగీకరించారు.
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 3 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో పొన్నాల లక్ష్మయ్య కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల నాడి కోదండరామ్ కు బాగా తెలుసునని, అది తమకు ప్రయోజనం చేకూరుస్తుందని కుంతియా అన్నారు. కూటమికి కోదండరామ్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు.
కోదండరామ్ అంగీకారంతో జనగామ టికెట్ పొన్నాల లక్ష్మయ్యకే దక్కింది. కోదండరామ్ కనీస ఉమ్మడి కార్యాచరణ కమిటీ చైర్మన్ గా ఉంటారని కుంతియా చెప్పారు. మహా కూటమి అధికారంలోకి వస్తే ఆ పదవికి క్యాబినెట్ హోదా కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రచారంలో సోనియా, రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. మహా కూటమి నేతలు ఉమ్మడిగా ప్రచారం సాగిస్తారని చెప్పారు. రాష్ట్రమంతా పర్యటించాలని కోదండరామ్ ను కోరినట్లు ఆయన తెలిపారు. కూటమికి పీపుల్స్ ఫ్రంట్ గా నామకరణం చేయాలని కాంగ్రెసు, టిజెఎస్ చర్చల్లో ఓ నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి కోదండ రామ్ ఎట్టకేలకు సర్దుకుపోయి జనగామ సీటు త్యాగం చేసి మరోసారి పొన్నాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అయితే ఆయన సీటు త్యాగం వెనుక వున్న అసలు రీజన్ మాత్రం కూటమి విజయం తర్వాత క్యాబినెట్ హోదా కల్పిస్తామని చెప్పటమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.