నాగం జ‌నార్ధ‌న్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!

nagam janardhan reddy political updates,trendingandhra
 
కాంగ్రెస్ నేత నాగం జ‌నార్ధ‌న్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. కాగా, గ‌తంలో తెరాస ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన  పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో దాదాపు రూ.2,400 కోట్ల రూపాయ‌ల  అవినీతి జ‌రిగింద‌ని, తెరాస ప్ర‌భుత్వ సాయంతో కాంట్రాక్ట‌ర్లు అవినీతికి పాల్ప‌డ్డారంటూ నాగం జనార్ధ‌న్‌రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
నాగం జ‌నార్ధ‌న్‌రెడ్డి వేసిన ఆ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు గ‌తంలోనే విచార‌ణ‌ను ప్రారంభించింది. విచార‌ణ అనంత‌రం నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి పిటిష‌న్‌పై ఇవాళ తుది తీర్పును హైకోర్టు వెల్ల‌డించింది. మీరు వేసిన పిటిష‌న్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవ‌ని, మీ పిటిష‌న్ చెల్ల‌దంటూ నాగం జనార్ధ‌న్‌రెడ్డి పిటిష‌న్‌ను హైకోర్టు  కొట్టేసింది.
 
అయితే, పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో దాదాపు 2,400 కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌ర‌గ‌డంతోపాటు కేవ‌లం 72 గంట‌ల్లోనూ తెరాస ప్ర‌భుత్వం అనుకున్న విధంగా టెండ‌ర్ల‌ను పిలిచి.. ముందుగా ఎంపిక చేసిన వారికే కాంట్రాక్టు ద‌క్కేలా టెండ‌ర్‌ను ఫైన‌లైజ్ చేశార‌ని, పంప్ హౌస్ నిర్మాణం నిమిత్తం కొనుగోలు చేసిన వ‌స్తువుల‌ను త‌క్కువ రేట్‌కు కొనుగోలు చేసి.. ఎక్కువ మొత్తంలో కాంట్రాక్ట‌ర్లు చూపారంటూ నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటిష‌న్‌లో పేర్కొన్నారు.