పెళ్లిపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు….!

దేశంలోవున్న రాజకీయ నాయకులలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. గుక్క తిప్పుకోకుండా చెప్పే ఒకే ఒక సమాధానం రాహుల్ గాంధీ. నాలుగు పదుల వయస్సు దాటుతున్న ఈయన ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు.

ప్రస్తుతం ఈయన హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన లో భాగంగా రాహుల్ గాంధీ మీడియా తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా అయన పెళ్లి పై ఒకరు ప్రశ్నించగా రాహుల్ దానికి అందరూ షాక్ అయ్యేలా సమాధానం ఇచ్చాడు.

ఇంతకు రాహుల్ గాంధీ ఏమన్నాడో తెలుసా…తన పెళ్లి కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో జరిగిపోయిందని రాహుల్ చమత్కరించారు. రాహుల్ చమత్కారం చూస్తుంటే ఇక భవిష్యత్తులో పెళ్లి చేసుకొనే అవకాశం లేదని మీడియా ప్రతినిధులు చర్చించుకుంటున్నారు.