జగన్ కి మరో ఊహించని షాక్ …..అవినాష్ కారణం గా షర్మిలా పార్టీ ని వీడనుందా ….!

jagan , sharmila , trendingandhra

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యం లో రాజకీయం వేడెక్కుతుంది . నేతల వలసలతో ఏపీ రాజకీయం కొత్త రంగుపులుముకుంటుంది . మారుతున్నా పరిణామాల నేపథ్యం లో నేతలందరూ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహాలని సిద్ధం చేసుకుంటున్నారు . ఎన్నికలకి కొన్ని నెలల సమయం మాత్రమే ఉండడం తో నేతలందరు కూడా ఎన్నికలలో తీసుకోబోయే వ్యూహాలపై తర్జనభర్జన పడుతున్నారు . కాగా ఏపీ లో ప్రస్తుతం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే గత కొన్ని రోజుల వరకు రెండు పార్టీ ల మధ్య మాత్రమే పోటీ తీవ్రంగా ఉంటుంది అని భావించారు ,కానీ సడెన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రేసు లోకి వచ్చి రాజకీయ వేడి ని మరింత గా పెంచేసాడు .

YS-Jagan,trendingandhra

ఇక పొతే పోయిన ఎన్నికల్లో కొద్దిలో అధికారాన్ని కోల్పోయిన జగన్ , వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కూడా అధికారాన్ని అందుకోవాలని చేయని ప్రయత్నం అంటూ లేదు . గెలుపే లక్ష్యంగా జగన్ గత సంవత్సరం ప్రారంభించిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఇప్పటికికూడా నిరంతరాయంగా కొనసాగుతుంది . రాష్ట్రము లో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని దాటుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకుపోతున్నారు . జగన్ చేప్పట్టిన ఈ ప్రజాసంకల్ప పాదయాత్ర కి మంచి స్పందన వస్తుంది . ఈ యాత్ర లో వైసీపీ పార్టీ కి కూడా మైలేజ్ పెరిగిందనే చెప్పవచ్చు . అంతా బాగుంది ఎన్నికల్లో గట్టి పోటీని ఇస్తుంది అన్న తరుణం లో పార్టీ లోని అంతర్గత కుమ్ములాటలు వైసీపీ కి మైనస్ గా మారె అవకాశం వచ్చేటట్టు ఉంది .

ys sharmila, trendingandhra

ఇక అసలు విషయానికొస్తే జగన్ అవినీతి కేసులో జైలు కి వెళ్ళినప్పుడు పార్టీ బాధ్యతలని పూర్తిగా తన భుజాలపై వేసుకొని పార్టీ బరువు బాధ్యతలని మోసింది . షర్మిలా పాదయాత్ర కూడా వైసీపీ కి మైలేజ్ తీసుకువచ్చిందని చెప్పవచ్చు . కానీ ఎన్నికల సమయం లో ప్రతికూల పరిస్థితులలో షర్మిలకు సీటు ఇవ్వలేదు . ఆమె స్థానం లో అవినాష్ కి కడప ఎంపీ సీట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి కడప ఎంపీ బరిలో నిల్చొని భారీ మెజారిటీ తో గెలుపొందాడు . కానీ కడప అంటే గొడవలు ,కొట్లాటలు కానీ , అవినాష్ వాటికీ దూరంగా ఉంటూ వస్తున్నాడు . ఇదే అలుసుగా తీసుకున్న ప్రత్యర్థి పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు . అవినాష్ స్వభావం మంచిదైనా కూడా , అది కడప లాంటి జిల్లాలో పనికిరాదు అని కొందరివాదన .

ఇక పొతే వచ్చే ఎన్నికల్లో షర్మిల కూడా పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తుంది . వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్ అవినాష్ వైపే మొగ్గుచూపుతున్నాడనే వాదన కూడా వినపడుతుండడం తో షర్మిల పార్టీ ని వీడబోతుంది అనే వార్త ఇప్పుడు హల చల్ చేస్తుంది . చూడాలి మరి మంచి ఫామ్ లో పార్టీ కొనసాగుతుంది అన్న తరుణం లో ఇలా కీలక నేతలందరూ పార్టీ కి దూరమవుతుండడం తో వైసీపీ పార్టీ కి మళ్ళీ ప్రతిపక్షమే ఖాయం గా కనిపిస్తుంది .

#ShocktoJaganIsSharmilaGoingtoLeavethePartybecauseofAvinash #YSSharmila #AvinashReddy