కాంగ్రెస్ లోకి సూపర్ స్టార్ ….!

superstar krishna , Congress , trendingandhra

సీనియర్ సినీ నటుడు హీరో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా కనపడుతోంది. ఈ ఆరోపణలను నిజం చేసేలా ఇప్పుడు ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది. అందులో కృష్ణ.. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారు.

Krishna , Superstar krishna , trendingandhra

పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ హీరో కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలంటూ ఆదివారం నానక్‌రాంగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నానక్‌రాంగూడలో నివాసం ఉంటున్న హీరోకృష్ణ నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. కృష్ణ సానుకూలంగా స్పందించినట్లు భిక్షపతియాదవ్‌ తెలిపారు.
ఈ నేపథ్యంలో.. బిక్షపతదియాదవ్ కృష్ణ మెడలో కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .