చంద్రబాబు వ్యూహం తో ప్రతిపక్షాల గుండెల్లో మొదలైన వణుకు …..సంబరాల్లో మునిగితేలుతున్న తెలుగుతమ్ముళ్లు ……..

Chandrababu , CM Chandrababu, TrendingAndhra

ఏపీలో మరో కొన్ని నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి .ఇప్పటి వరకు పాలనా పరంగా చేసిన అభివృద్ధి ద్వారా వచ్చే ఫలితం కన్నా..ఇప్పటి నుంచి రాజకీయంగా వేసే ప్రతి అడుగుకీలకంగా మారుతుంది . ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజకీయం అపరచాణ్యుక్యుడు గా పేరున్న బాబు మరో వ్యూహం తో మన ముందుకు రానున్నాడు . ప్రత్యర్థులను సాధ్యమైనంత వరకు లేకుండా చేసుకుంటే ఫలితం ఏక పక్షంగా మారుతుందనే రాజకీయ సిద్ధాంతాన్నిఆయన అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.


ఇప్పటికే ఒక సారి ఇలాంటి సిద్ధాంతాన్ని అమలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మరోసారి ఇదే మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ టికెట్‌పై గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆయన ఆకర్ష్ మంత్రంతో తన గూటికి చేర్చుకున్నారు.దీంతో వరుస పెట్టి 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడా వైసీపీ నుంచి జంప్ చేసి చంద్రబాబు తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో కొందరికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌-2కి రంగం సిద్ధమైందనే వాదన వినిపిస్తోంది. ఈ సారి ఎక్కువగా ఈ ఆపరేషన్‌లో మాజీలే కనిపిస్తుండడం గమనార్హం.

ఆకర్ష్-2 జాబితాలో పలువురు సీనియర్లు ఉన్నారు.శ్రీకాకుళం జిల్లా నుంచి కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీని చేర్చుకోవాలని భావిస్తున్నారు. విశాఖ నుంచి సబ్బం హరిని కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఆయనకు విశాఖ ఉత్తరం టికెట్ కూడా ఇవ్వాలని నిర్ణయించారని తెలిసింది. అలాగే మాజీ మంత్రి వైసీపీ మాజీ నేత, ఉత్తరాంధ్రపై మంచి పట్టున్న కొణతాల రామకృష్ణను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని బాబు నిర్ణయించినట్టు సమాచారం.

ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను సైకిలెక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయనకు రాజమండ్రి ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇక్కడ ఎంపీ మురళీ మోహన్ ఎలాగూ రిటైర్ అవుతున్నారు. ఆయన కోడలు రూపాదేవికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇక కర్నూలు జిల్లాలో మంచి పట్టున్న కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ విధంగా సాధ్యమైనంత వరకు బాబు ప్రత్యర్దులని పార్టీ లో చేర్చుకోవడం ద్వారా గెలుపు మరింత సులువు అవుతుందని , ఈ విషయం పై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాల సమాచారం .