ఆ స్థానం సీపీఐ కి ఇస్తే మద్దతివ్వం .. స్థానిక కాంగ్రెస్ నేతల అల్టిమేటం

cpi,congress,ThatPositionGivenToTheCpiLocalCongressLeadersToSayTheyDontGiveSupportToCpi,telangana politics,trendingandhra

మహాకూటమి లెక్కలు ఓ పట్టాన తేలేలా లేవు. ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులెవరో జాడ లేరు. ఎక్కడ ఏ పార్టీ బరిలోకి దిగుతుందో తెలీటం లేదు. కాసేపు సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని కాసేపు టీజేఎస్ తో పంచాయితీ అని , వాళ్లు అడిగిన సీట్లు ఇవ్వకుంటే పోతామని బెదిరిస్తున్నారని రకరకాల వార్తలు వచ్చాయి. ఇక ఏదో మల్లగులాలు పడి ఎవరికి ఎన్నో ఒక లెక్కకి వచ్చారంటే ఇప్పుడు అసలు పంచాయితీ ప్రారంభం అయ్యింది. నిన్నటి దాకా సైలెంట్ గా ఉన్న సీపీఐ తానూ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసి తీరుతాను అంటుంది. తమకు గెలిచే అవకాశం ఉన్న చోట అవకాశం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్తుంది.
ఇక వైరా స్తానం నుండి సీపీఐ కి అవకాశం ఇస్తారన్న వార్తల నేపధ్యంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్న వైరా సీటును సీపీఐకి కేటాయిస్తే తాము మద్దతివ్వమని వైరా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సూరంపల్లి రామారావు స్పష్టంచేశారు. ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే వైరా సీటు కాంగ్రెస్‌కు ఇవ్వాలని మహాకూటమి నాయకులందరూ నియోజకవర్గంలోని పరిస్థితిని పరిశీలించాలని కోరారు. తప్పదని సీపీఐకే ఇస్తే మాత్రం ఇండిపెండెంట్‌గా తమ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీపీఐ జిల్లా పార్టీకి, టీపీసీసీకి కూడా తెలియజేశామన్నారు.
మహాకూటమి నాయకులందరూ ఐక్యంగా ఆలోచించి కాంగ్రెస్‌కు సీటు కేటాయించి.. ప్రత్యర్థి నుంచి గెలిపించుకునేలా కృషిచేయాలని కోరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓటు బలంగా ఉంటె సీపీఐ కి టికెట్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మొత్తానికి రెబల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆ స్థానంలో ఎన్నికల బరిలోకి దిగే అవకాశం వుంది. ఒకపక్క సీపీఐ తమకు ఆ స్థానం కావాలని పట్టు పడుతుంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు అల్టిమేటం జారీ చేస్తుంటే కాంగ్రెస్ అధినాయకత్వం దిక్కు తోచని స్థితిలో ఉంది. అసలు ఈ కూటమి ఉంటుందా అన్న సందేహం సైతం కూటమి పార్టీల్లో నెలకొంది.

#Cpi #Congress #ThatPositionGivenToTheCpiLocalCongressLeadersToSayTheyDontGiveSupportToCpi #TelanganaPolitics #TelanganaCongress