కాంగ్రెస్ తో కలిసింది అందుకే……. కాంగ్రెస్ తో దోస్తీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన బాబు

Congress-TDP alliance, major leaders resign!,congress with tdp,congress tdp mahakutami,mahakutami in telangana,trendingandhra

టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు .. సిగ్గు చేటు .. ఛీ ఇంత కన్నా దారుణం ఉందా… కాంగ్రెస్ కు బద్ధ శత్రువుగా ఆ నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా పార్టీ పెడితే అలాంటి కాంగ్రెస్ వాళ్ళతో కలిస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభించదా? ఇలా ఎన్నో దాడులు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం పై జరుగుతున్నాయి. వాటన్నిటికీ బాబు సమాధానం చెప్తూ అవును ఆత్మ‌గౌర‌వం నినాదంతోనే తెలుగుదేశం పుట్టింది ఇప్పటికీ తెలుగుదేశం అదే మాటపై ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్టంగా చెప్పారు. తెలుగుదేశం పుట్టింది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం కానీ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా కాదు అని చెప్పారు చంద్రబాబు. తెలుగు వాళ్ల‌ను గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేయ‌డానికే నాడైనా నేడైనా తెలుగుదేశం పని చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఆరోజు కాంగ్రెస్ తెలుగు వాళ్ల‌ను అవ‌మానించింది కాబ‌ట్టి తెలుగుదేశం పుట్టి వారిపై పోరాడింది. కానీ ఇప్పుడు బీజేపీ అవ‌మానిస్తోంది కాబ‌ట్టి తెలుగుదేశం అదే ఆత్మ‌గౌర‌వం కోసం కాంగ్రెస్‌తో క‌లిసి బీజేపీ పొగరణచటానికి సిద్ధం అయ్యింది అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.
చాలా మంది త‌న‌ను విమ‌ర్శిస్తున్న వారు తెలుసుకోవాల్సిన విష‌యం ఒక‌టుందన్న చంద్రబాబు తెలుగు వారు గ‌ర్వంగా ఉండాల‌ని మాత్ర‌మే తెలుగుదేశం కోరుకోవ‌డం లేదు. భార‌త‌దేశం మొత్తం భ‌ద్రంగా ఉండాల‌ని కూడా టీడీపీ అభిల‌షిస్తుందని తన మనసులోని మాట చెప్పారు. కేంద్ర రాజ‌కీయాల్లో ఎప్ప‌టిలాగే దేశం కోసం టీడీపీ కృషిచేస్తోంద‌న్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని స్కాములతో భ్రష్టు పట్టించిందని ఏపీకి అన్యాయం చేసిందని అన్నారు. ఈ రోజు దేశానికి ప్రమాదం వాటిల్లిందని బాబు అన్నారు. . దేశానికి ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా టీడీపీ క్రియాశీలక పాత్రను పోషించిందని చెప్పిన చంద్రబాబు ఇపుడూ అలాగే ముందుకు సాగుతామని చెప్పారు. మోడీ చేతిలో ఆర్ధిక వ్యవస్థ పతనం అయ్యిందని, చమురు ధరలు ఆకాశం తాకాయని.ఏ వ‌ర్గ‌మూ సంతోషంగా లేదన్న చంద్రబాబు దేశాన్ని కాపాడటానికే అందర్నీ ఏకం చేసే పని ఉన్నానని చెప్పారు.
అటు ప్రజలను కూడా మోడీ పాలనకు చరమగీహం పాడాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్న బాబు ఎవ‌రిని అయినా ఎదిరించే గుణం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నానని చెప్పారు. అందుకే మోడీ నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ పోరాటం చేస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఏపీని నంబర్ 1గా నిలపటం కూడా తనముందున్న ప్రాధాన్యం అని చెప్పారు చంద్రబాబు. ఎట్టకేలకు చంద్రబాబు ఇంత కాలం కాంగ్రెస్ తో దోస్తీపై విమర్శిస్తున్న వారికి సమాధానం చెప్పారు.

#That’sWhyChandraBabunaiduJoinedTheCongress .. #FullClarityOnDostiwithCongress #ChandraBabuNaidu #Chandrababu #NChandraBabuNaidu #ChandraBabuWithCongress