ఏపీలో కేసీఆర్ ఎంట్రీ పై జగన్ స్పందన … బాబుకు షాక్

Jagan Reaction on KCR Entry in AP ... Shock for Babu, Trendingandhra
తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పారు సీఎం కేసీఆర్. చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ కి రివర్స్ గిఫ్ట్ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై ఇప్పటకే చంద్రబాబు టెన్షన్ లో ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అడుగడుగునా రంగులు మారుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో అనైతిక పొత్తుకు ప్రజలు గుణపాఠం చెప్పడంతో చంద్రబాబు మాట మార్చారని ఆయన అన్నారు. ఇప్పుడు కేసీఆర్ వస్తారనే భయం పట్టుకుందని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ తాము పర్యటిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారని, అందుకే ప్రత్యేకహోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ ఏపీలోకి రావడం ఏమిటని వంక పెడుతున్నారని జగన్ అన్నారు. అలాంటప్పుడు టిఆర్ఎస్ తో తెలంగాణ ఎన్నికల సమయంలో పొత్తుల కోసం ఎందుకు అర్రులు చాచారని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరి ఉంటే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసే వారా? అని ఆయన అడిగారు. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసి తమిళనాడులో కరుణానిధి విగ్రహావిష్కరణకు చంద్రబాబు వెళ్లడం విడ్డూరంగా ఉందని జగన్ పేర్కొన్నారు.

Related image దేవుడి ఆశీర్వాదంతో వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ ప్రభుత్వ పథకాలను హోం డెలివరీ చేస్తానని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్‌ నరసన్నపేటలోని బహిరంగ సభలో ప్రసంగించారు. గ్రామాల్లో అన్ని వర్గాలతో సచివాలయాలను ఏర్పాటు చేస్తామని, అన్ని అర్జీలను ఈ సచివాలయాలు 72 గంటల్లో పరిష్కరిస్తాయని ఆయన చెప్పారు. ఈ సచివాలయాలు సమర్థంగా పనిచేసేలా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తామని చెప్పారు. తద్వారా ప్రభుత్వ పథకాలన్నింటినీ హోం డెలివరీ చేస్తామని చెప్పారు. మొత్తానికి కేసీఆర్ తెలంగాణా ఎంట్రీ పై జగన్ సానుకూలంగా ఉన్నారు. కేసీఆర్ తో కలిసి ముందుకు నడిచే వ్యూహంలో జగన్ వున్నారని ఆయన మాటలను బట్టి అర్ధం అవుతుంది.