బాబు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారట… ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు అందుకే

Election Latest News In Chandrababu and TRSతెలంగాణా ఎన్నికల్లో రాజకీయం రసకందాయంలో పడింది . ఒకరి మీద ఒకరు ఆరోపణలు , ప్రత్యారోపణలతో రసవత్తర రాజకీయం చేస్తున్నారు. అంతేనా ఈసీకి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బాబు తెలంగాణా లో ప్రచారమే చెయ్యలేదు. కానీ చంద్ర బాబు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఆయన మీద ఫిర్యాదు చేశారు గులాబీ పార్టీ నాయకులు .
అదేంటి ఇప్పటి వరకు బాబు తెలంగాణా ఎన్నికల వ్యవహారం లో బయటకు వచ్చి మాట్లాడింది లేదు ప్రచారంలో కూడా కనీసం పాల్గొంది లేదు కదా … మరి ఏ విధంగా ఆయన మీద ఫిర్యాదు చేశారు అంటే ఆయన పక్క రాష్ట్ర అభివృద్ధి మీద ఇస్తున్న ప్రకటనలు ఇక్కడ ప్రజల మీద ఎఫెక్ట్ చూపిస్తాయట. అందుకే ఆ ప్రకటనలు నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు గులాబీ నాయకులు.

Image result for chandrababuఇష్టారాజ్యంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ఇంగితం మరచి నోటికొచ్చినట్టు దొంగ అని బొడ్లో కత్తి పెట్టుకు తిరుగుతున్న ఆంధ్రోడని అడ్డమైన బూతులు తిట్టిన కేసీఆర్ ను కేవలం సంస్కారం తో మాట్లాడండి అని మాత్రమే అన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఏ రకమైన ఆరోపణలు చెయ్యలేదు. పక్క రాష్ట్రం అయిన ఏపీలో ఎన్నికలు ఇప్పుడు లేవు కాబట్టి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పై ప్రకటనలు ఇస్తున్నారు చంద్రబాబు. అయితే అది ఏదో చెయ్యరాని నేరం చేసినట్టు ఈసి కి ఫిర్యాదు చేశారు.
అసలు విషయం ఏమిటంటే చంద్రబాబు తెలుగు చానల్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ఇస్తున్న ప్రకటనలు చూసి తెలంగాణా ప్రజల మనసు తీదీపీమీడకు మారుతుందని ఇక్కడ గులాబీ పార్టీ కి ఇబ్బంది అంట. ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఇస్తున్న ప్రకటనలు ఆపాలని ఈసీ కి ఎంపీ వినోద్ కుమార్ తో కంప్లైంట్ ఇప్పించారు కేసీఆర్
అయితే, తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కానీ చానళ్ళు మాత్రం రెండు రాష్ట్రాలకు అవే వున్నాయి. అక్కడ ఎన్నికలు జరగటం లేదు కాబట్టి అక్కడ ప్రగతి జనాలకు తెలియజేసేందుకు ప్రకటనలు ఇస్తే తప్పేముంది అనేది టీడీపీ వాదన. చంద్రబాబు 5 లక్షల ఇల్లు కట్టి అవి చూపిస్తున్నాడు, మరి తెలంగాణా ప్రజలు మా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏవి అంటే ఏమి చెప్తాడు అనేదే కేసీఆర్ భయం అని తెలుగుతమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి ఆ రాష్ట్ర ప్రటనల ఎఫెక్ట్ ఈ రాష్ట్రం మీద పడుతుందని ఈసీ కి ఫిర్యాదు చేయించారు గులాబీ బాస్ .