అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన…. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి వ్యూహాలు

 
Komati Reddy and Revant Reddy the Lok Sabha Election Targeted to win, Trendingandhra
ఇపుడు అందరి చూపు లోక్‌సభ ఎన్నికలపైనే
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ సీనియర్ నేతల దృష్టి అంతా అటు వైపే, ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనే వార్తల నేపథ్యంలో తాము పోటీ చేయాలనుకుంటున్న లోక్‌సభ స్థానంలోని పరిస్థితులపై ఓ అంచనాకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో పాటు రేణుకా చౌదరి, గూడూరు నారాయణరెడ్డి, అజారుద్దీన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్లు ఎంపీ అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్నాయి. వీరంతా ఇప్పటికే తమ తమ స్థానాల్లోని ఫలితాల తీరు, గెలుపొందిన ఎమ్మెల్యేల బలా బలాలు ఎలా ఉన్నాయో ఒక అంచనాకు వచ్చారు.
 
Image result for komati reddy
 
నేను పోటీ చేస్తా… కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
ఈ నేపధ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా…  ఈసారి లోక్‌సభకు వేరుగా ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు కొంత తక్కువగానే ప్రభావం చూపుతాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఉండే సానుకూలత, మోదీ పట్ల వ్యతిరేకత ఉన్న ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారనే ఆశావాద దృక్పథంతో లోక్‌సభ బరిలో దిగేందుకు వీరంతా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి 
అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది.
గత ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన ఆయన తాను ఎంపీగా పోటీచేసే అంశం రాహుల్‌ దృష్టిలో ఉందని, ముందస్తుగా అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినందునే పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ఈసారి నల్లగొండ జిల్లాలోని ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డి సహకారంతో నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఈసారి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయనే చర్చ నేపథ్యంలో కూడా కోమటిరెడ్డి పోటీవైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక, భువనగిరి ఎంపీ స్థానాన్ని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. తనకు ఈసారి అధిష్టానం అవకాశం ఇస్తుందనే అంచనాలో ఆయన ఉన్నారు. అక్కడి నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా వినిపిస్తోంది.