జాతకాలని నమ్మి రాష్ట్రాన్ని గాలికి వదిలేసినా కెసిఆర్: రేవంత్ రెడ్డి..

తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ రోజు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హస్తసాముద్రికం, చిలకజోస్యం, గవ్వలను నమ్ముకుని తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలనుకోవడం సీఎం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కెసిఆర్ ని విమర్శించారు.

‘ఏ శాస్త్రిగారు ఏం చెప్పారో! ఆ పిచ్చిలో పడి, రాష్ట్రాన్ని, ప్రజలని గాలికొదిలేసి ముందస్తు ఎన్నికలంటూ అందరిని ఇబ్బందులు పెడుతున్నాడు. కేసీఆర్ కు జాతకాలు చెప్పే వాళ్లెవరో గాని, అసలు ఈయన జాతకం దరిద్రంగా ఉంటె, రాష్ట్రం జాతకాన్ని కూడా సర్వనాశనం చేయాలని కెసిఆర్ కంకణం కట్టుకున్నాడని రేవంత్ ఎద్దేవా చేసారు. ఇట్లాంటి పిచ్చోడున్న సభలో.. మరియు వారి సబ్యులకు చట్టాలు, శాసనాల పట్ల అవగాహన ఉందో లేదో?’ అని ప్రశ్నించారు.