చివరికి వాటిని కూడా వదలలేదు..

ప్రభుత్యం 18 ఏళ్ల వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిపిస్తుంది. ఎన్నికల ముందు ఓటరు జాబితాను ప్రకటిస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణం లో ఓటర్ల జాబితాను రూపొందించడంపై దృష్టి పెట్టారు అధికారులు. అయితే ఆ అధికారులు ఏనుగు, జింక, పావురం తో పాటు సన్నీ లియోన్ కి కూడా ఓటు హక్కును ఇచ్చేశారు. అంతేకాకుండా వారి పేర్లను ఓటర్ల జాబితాలో కూడా చేర్చారు. అదికూడా లో దుస్తులతో ఉన్న సన్నీలియోన్ ను చేర్చారు.

ఈ ఘటనపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పట్టణంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గ్రామీణ ప్రాంతానికి విధుల నిర్వహణ సందర్భంగా ఈ నిర్వాకం వెలగబెట్టాడని తెలిపారు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ జాబితాను సవరిస్తున్నట్లు పేర్కొన్నారు.