“మద్దెలచెరువు సూరి” హత్య కేసులో ప్రధాన దోషులు …!

The main Convicts in the murder case of "Maddalacheruvu Suri"...! Trendingandhra
రెండు కుటుంబాల మధ్య  జరిగిన హత్యల నేపధ్యంలో కొన్ని రాజకీయ శక్తులు వాటి మధ్య పరువు పగలు అంటూ చాలా ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే.ఇక అంతా అయిపోయింది 
అని అనుకుంటూ ఉండగా మద్దెలచెరువు సూరి హత్య జరగడం ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ అతడికి సహకరించిన రెండవ నిందితుడు మన్మోహన్‌సింగ్‌లను కోర్టు దోషులగా తేల్చింది. వీరికి శిక్షను కూడా కోర్టు విధించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సుబ్బయ్య, వంశీ, వెంకటరమణ, హరిబాబును కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది.సూరి హత్య కేసు విచారణ ఏడేళ్లపాటు సుదీర్ఘంగా కొన సాగింది.
 
 ఈ కేసులో సీఐడీ అధికారులు కీలకంగా మారారు. సాక్ష్యాలను పకడ్బందిగా కోర్టు సమర్పించారు. 52 మెటీరియల్ ఎవిడెన్స్‌ను అధికారులు కోర్టుకు అందజేశారు. 105 మంది సాక్షులను సీఐడీ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరిలో 92 మంది ఇచ్చిన సాక్షాధారాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని పూర్తి విచారణ అనంతరం భానుకిరణ్ అతనికి సహకరించిన మన్మోహన్‌సింగ్‌లను దోషులుగా తేల్చి చెప్పింది.
 
సూరి హత్య జరిగిన తర్వాత భానుకిరణ్ ఎలా పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు.. అతడికి ఎవరు ఎలా సహకరించారు. అలా సహకరించిన వారిపై సీఐడీ దృష్టి కేంద్రీకరించి విచారణ జరిపింది. హత్య తర్వాత భాను స్నేహితుడు లోక్‌నాథ్ భానును కారులో షోలాపూర్‌కు తీసుకెళ్లారని సీఐడీ విచారణలో తేలింది. ఈ తర్వాత లోక్‌నాథ్‌ను ఈ కేసులో సాక్ష్యంగా తీసుకున్నారు. 2011 జనవరి 3న హైదరాబాద్‌లో మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యాడు. 2012 ఏప్రిల్‌ 21న భాను కిరణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతా నిందితులను 2011 జనవరి 29న అరెస్ట్‌ చేశారు.