వారెవ్వా.. ఎమ్మెల్యే చింత‌మ‌నేనిలో ఎంత మార్పు..!

 What is the change in MLA Chinthamaneni.. Trendingandhra
 
దెందులూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనిప్ర‌భాక‌ర్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అయితే, ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప్ర‌యాణిస్తున్న కారును టోల్‌గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. తాను  దెందులూరు ఎమ్మెల్యేన‌ని, అధికార పార్టీకి చెందిన వ్య‌క్తిన‌ని చెప్పిన‌ప్ప‌టికి టోల్‌గేట్ సిబ్బంది చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప్ర‌యాణించిన కారును అడ్డుకున్నారు.
 
టోల్‌గేట్ సిబ్బంది త‌న కారును అడ్డుకోవ‌డంతో ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చేసేదేమీలేక త‌న కుటుంబ స‌భ్యుల‌ను కారులోనుంచి బ‌స్సులో ఎక్కించి ప్ర‌యాణించారు. అయితే, ప్ర‌జాప్ర‌తినిధులైన ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రుల‌కు టోల్‌గేట్ ఛార్జీల నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయినా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కారును టోల్‌గేట్ సిబ్బంది అడ్డుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
 
Related imageఅయితే, తాను చేస్తున్న ప‌నికి ఎవ్వ‌రు అడ్డొచ్చినా చేతికో, లేక నోటికో ప‌నిచెప్పే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఈ సారి ఆ రెండింటిని వాడ‌కుండా సైలెంట్‌గా వెళ్లిపోవడం అక్క‌డున్న వారంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీనికి కార‌ణం గ‌తంలో ఆయ‌న చేసిన నిర్వాకాలేన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా వివాద‌స్ప‌ద ఎమ్మెల్యేగా చింత‌మ‌నేనికి పేరు కూడా ఉంది. దీంతో సీఎం చంద్ర‌బాబు చింత‌మనేనిని పిలిపించి క్లాస్ పీక‌డంతోనే ఇవాళ టోల్‌గేట్ సిబ్బందితో ఎటువంటి వివాదం పెట్టుకోలేద‌ని అంటున్నారు స్థానికులు.