మత తత్వ రాజకీయాల పై విరుచుకు పడ్డ ప్రకాష్ రాజ్ ?

prakash raj hot commemts on politics,trendingandhra

ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజు ప్రస్తుతపు దేశ ,రాష్ట్ర రాజకీయాలపై పౌరుడిగా తనకున్న భావజాలాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేసారు .ముఖ్యంగా బీజేపీ పార్టీ నీ నరేంద్ర మోడీ గారిని వ్యక్తి గతంగాను ,ఒక పౌరుడిగాను ,దేశం లో నెలకొన్న మత రాజకీయాల గూర్చి తనదైన శైలి లో విరుచుకు పడ్డారు .

నోట్ల రద్దు వలన ప్రజల కి దేశానికి జరిగిన అన్యాయం గూర్చి ఐరన్ మాన్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం
పెట్టడం వెనక దేశం యెక్క ఖ్యాతి పక్కన పెడితే, జరిగిన నష్టమే పెద్దది . ౩౦౦౦కోట్లు ఎవరి డబ్బు నా డబ్బు మన డబ్బు ప్రజలది ఒక కేరళ కి వరదలు వస్తే 600కోట్లు అంటే మనిషి చచ్చిపోతుంటే….. మీకు దేశ గౌరవం కావాలా పటేల్ గారి గొప్పతనం ఇలాగ చెప్పుకునేది. దానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆయన పేరు మీద చేయవలసిన మంచి పనులెన్నో మీకు కనిపించడం లేదా ఒక వైపు స్కూల్స్ మూత పడుతుంటే మరో వైపు నిరుద్యోగం పెరుగుతుంటే. ఆర్ ఎస్ ఎస్ ని బ్యాండ్ చేసిన మహానుభావుడి విగ్రహాన్ని మళ్ళీ వాళ్లే పెడుతుంటే ఎలా ఉంటుంది అని అనడం జరిగింది .తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పై తన కున్న అవగాహన తాను చూస్తున్న కోణం లో కె.సి.ఆర్ గారిపై తన పరిపాలన దక్షతని బలంగా చెప్పడం జరిగింది. వ్యక్తి గతంగా తనకున్న ప్రత్యక్ష రిలేషన్ కె.సి. ఆర్ అండ్ కె.టి.ఆర్ డైనమిక్ పర్సన్స్ అని చెప్పుకురావడం జరిగింది. అలాగే మహాకూటమి గూర్చి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఒక రకంగా టి ఆర్ ఎస్ కి అనుకూలంగా మాట్లాడడం .రానున్న ఎలక్షన్స్ కబడ్డీ ఆట కాదు ఎవరు పడితే వాళ్ళు ఆడడానికి రాష్ట్ర భవిష్యత్ గా పేర్కొనడం జరిగింది ప్రాంతీయ పార్టీ లు గా ఎవరి రాష్ట్రము లో వాళ్ళు వాళ్ళ సమస్యలపై పోరాటం చేయాలె కానీ టీ.డి.పి తెలంగాణ లో పోటీ చేసి పది హేను సీట్స్ గెలిచి ఏం చేస్తారు. రేపటి నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే ఎటు వైపు ఉంటారు అవగాహన ఉండాలి గా …
ఇలా ప్రాంతీయ పార్టీలు, నాయకులు సెంట్రల్ పార్టీలకు అమ్ముడు పోయే విధానాన్ని మార్చుకోవాలి తప్పు జరిగితే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి అని తనదైన ముక్కుసూటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.