పృథ్వీషా తన మొదటి సెంచరీని ఎవరికి అంకితమిచ్చాడో తెలుసా…..?

Prithvi shaw , TrendingAndhra

భారత్-విండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా సెంచరీ బాది రికార్డులకెక్కాడు. అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు.

prudhvi shaw , trendingandhra

తొలి సెంచరీ సాధించిన షా దానిని తన తండ్రికి అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. తన కోసం తండ్రి పంకజ్ ఎన్నో త్యాగాలు చేశారని, తన తొలి సెంచరీని ఆయనకే అంకితమిస్తున్నట్టు ఉద్వేగంగా చెప్పాడు. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం షా మాట్లాడుతూ.. తొలి టెస్టులోనే సెంచరీ చేయడం ఆనందంగా
ఉందన్నాడు.

prithvi-shaw , trendingandhra

ఇన్నింగ్స్ మొత్తం తన సహజ శైలిలోనే ఆడినట్టు చెప్పాడు. తొలుత కొంత ఒత్తిడికి గురైన మాట వాస్తవమేనని, తర్వాత క్రీజులో కుదురుకున్నానని వివరించాడు. విండీస్‌తో జరుగుతున్న టెస్టులో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన పృథ్వీషా 154 బంతుల్లో 134 పరుగులు చేశాడు.