మొదటి మ్యాచ్ లో  సెంచరీ తో కదం తొక్కిన పృధ్వీషా…!

prithvi shaw , TrendingAndhra
వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్‌ పృథ్వీషా అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించాడు. ఓపెనర్‌గా
క్రీజులో వచ్చిన పృథ్వీ.. కేవలం 99 బంతుల్లోనే 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు . నేడు రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన పృధ్వీషా, అంచనాలను మించి అదరగొట్టాడు. అది కూడా 100 బంతులలోపే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టును ఆడుతూ, 100 బంతుల్లోపే సెంచరీ సాధించింది ఇంతవరకూ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే.

prudhvi shaw , trendingandhra

గతంలో వెస్టిండీస్ కు చెందిన డ్వేన్ స్మిత్ తన అరంగేట్రంలో 93 బంతుల్లో సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ తానాడిన మొదటి మ్యాచ్ లో 85 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వీరిద్దరి సరసనా ఇప్పుడు పృధ్వీ షా నిలిచాడు. షా ఈ మ్యాచ్ లో 99 బంతుల్లో సెంచరీ సాధించాడు.  ప్రస్తుతం భారత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 232 పరుగులు. కాగా,కోహ్లీ 4 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు . భారత్ భారీ స్కోరును నమోదు చేసే దిశగా ముందుకి  సాగుతోంది.