నిఖిల్ సినిమా లో ప్రియా ప్రకాశ్…!

ఇప్పుడు ఎక్కడ చూసినా కుర్రాళ్లంతా ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఓరు ఆధార్ లవ్ మలయాళ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన వీడియోతో ఆమె పాప్యులారిటి ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఈ వీడియోలో ఆమె చూపిన హావభావాలకు కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు. దాంతో ఒక్కసారిగా అటు మలయాళంతో పాటు ఇటు ఇతర భాషల్లో కూడా ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయట. నిఖిల్,తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేయాలనుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రియా ప్రకాశ్ ను సంప్రదించగా, ఆమె డేట్స్ చూస్తోన్న దర్శకుడు ఒమర్ లులు రెండు కోట్లు డిమాండ్ చేశాడట.

ఇక ఈ అమ్మాయిని తమ సినిమాల కోసం మాట్లాడమని మరి కొంతమంది కుర్ర హీరోలు కూడా దర్శక నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.