నెట్ సెర్చ్‌లో సన్నీ లియోన్‌ను పక్కకు నెట్టేసిన ప్రియా ప్రకాశ్..!

ప్రియా ప్రకాశ్ వారియర్ ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ పేరే వినిపిస్తోంది. ఆమె ఓవర్‌నైట్‌లో అంతలా పాపులర్ అయిపోయింది మరి. ఎంత పాపులర్ అంటే చివరకు పోర్న్ సుందరి సన్నీ లియోన్‌ను కూడా క్రాస్ చేసేటంతగా!

అవును నిజంగానే. గత రెండు మూడు రోజులుగా గూగుల్‌లో అత్యధికంగా శోధిస్తున్న పేరు ప్రియా ప్రకాశ్‌దేనట. ఆ రకంగా సన్నీని ఆమె పక్కకునెట్టేసింది. నెట్‌లో వైరల్‌గా మారిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవే పాటలోని ఆమె ఎక్స్‌ప్రెషన్లు నెటిజన్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి.

ఒక్క పాటతో నాకు ఇపుడు దక్కుతున్న ఆదరణ నన్నెంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు. నాకు అసలు మాటలు రావడం లేదు. మొత్తానికి నాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రియా ‘ఇండియా టుడే’కి తెలిపింది.

ముఖ్యంగా తనకు క్రేజ్ తీసుకొచ్చిన ‘కనుబొమ్మ’ ఎక్స్‌ప్రెషన్ గురించి ఈ క్యూట్ గర్ల్ వివరించింది. దర్శకుడు, తన సహ నటుడు రోషన్ తనను కొన్ని క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌లు ఇవ్వాలని కోరారని, అప్పుడే కనుబొమ్మ ఎక్స్‌ప్రెషన్ అలా ఒక్క టేక్‌లోనే వచ్చేసిందని ఈ ముద్దుగుమ్మ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది.