ప్రియా దెబ్బకు పడిపోయిన టాప్ స్టార్స్..!

ప్రియా కన్ను గీటినప్పుడు రాహుల్ సిగ్గుపడితే, మోదీ నవ్వాపుకోలేకపోతే, రజనీ మెలికలు తిరిగిపోతే ఎలా ఉంటుంది. ఇదంతా ఏంటనుకుంటున్నారా ప్రియా వారియర్ వీడియోతో చేసిన స్ఫూఫ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయ్.పేరు తగ్గట్లే ప్రియా వారియర్ కుర్రకారు గుండెలపై వార్ ప్రకటించింది. ప్రియా చూపులు నేరుగా తమ గుండెల్లోనే గుచ్చుకున్నట్టు ఫీలైపోతున్నారు కుర్రాళ్లు. ఆమె కన్ను గీటితే సిగ్గుపడందెవరు, నవ్వకుండా ఉండేది ఎవరంటూ నెటిజన్లు క్రియేటివిటీకి పదును పెట్టారు. స్ఫూఫ్ వీడియోలు రెడీ చేసి వదిలారు. ఇప్పుడవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయ్.

రాహుల్ గాంధీ నుంచి రానా వరకు ట్రంప్ నుంచి మోదీ వరకు ఎవరినీ వదల్లా అందరినీ ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కనుసైగల వాలుచూపుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆమె కన్నుగీటితే వారు ఎలా స్పందిస్తారో చూపిస్తూ స్పూఫ్‌ వీడియోలు వదిలారు. ముఖ్యంగా ప్రియా కన్నుగీటితే బ్రహ్మచారి రాహుల్‌గాంధీ ముసిముసి నవ్వులు రువ్వుతూ లోలోపల సిగ్గుపడుతున్నట్టు ఉన్న స్పూఫ్‌ నెటిజన్లను తెగ అలరిస్తోంది.

మోదీని కూడా వదల్లేదు నెటిజన్లు. ప్రియా కన్నుగీటితే పీఎం అయినా సరే వయసు మరిచిపోవాల్సిందే అన్నట్టుగా వీడియోను రూపొందించారు. ప్రియా సైట్ కొట్టగానే మోదీ చిన్నగా నవ్వుతూ మురిసిపోయిన వీడియో తెగ వైరల్ అయిపోయింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా ఈ స్పూఫ్ వీడియోల్లోకి లాగేశారు. ట్రంప్ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌కు ప్రియా వారియర్ కనుసైగల వీడియోను కలిపేసి యూట్యూబ్‌లో వదిలారు. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేం.

ఇక ప్రియా వీడియోకు యోగా గురు రాందేవ్ బాబా రెస్పాండ్ అయినట్లు చేసిన స్ఫూఫ్ మాత్రం కడుపుబ్బా నవ్విస్తోంది. ప్రియా కంటి సైగలకు రాందేవ్ బాబా ఆసనాలు లింక్ చేస్తూ సింక్ చేసిన వీడియో చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుతున్నారు.

రజనీకాంత్ స్ఫూప్ అయితే పేలిపోయింది. ప్రియా సైగలకు సూపర్ స్టార్ తెగ సిగ్గపడిపోతున్నట్లు చేసిన స్ఫూఫ్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. పర్ఫెక్ట్ యాప్ట్‌గా కనిపిస్తోంది స్ఫూఫ్.

ఇక ప్రియా సైగలకు తమిళ్ స్టార్ విజయ్ కాంత్ ఇలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే ఎలా ఉంటుందబ్బా అంటూ చేసిన స్ఫూఫ్ చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు.

వీళ్లే కాదు. ప్రభాస్, రానాను కూడా వదల్లేదు. ప్రియా కను సైగలు చూసి కుర్రాళ్ల పరిస్థితి ఇది అంటూ చేసిన ఓ స్ఫూప్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.