ప్రియదర్శి పెళ్లి ఫిక్స్..!

టాలీవుడ్ లో టాలెంట్ ఉంటె ఏవరైనా ఫేమస్ అవ్వచ్చు అనడానికి ప్రియదర్శి నిర్వచనం గ ఉంటాడు. ఈ మధ్య కాలంలో యంగ్ కమెడియన్ గా బాగా పాప్యులర్ అయినవారి జాబితాలో ప్రియదర్శి కనిపిస్తాడు.

తన మార్క్ కామెడీ తో చాలా తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఆయన, యువ కథానాయకుల సినిమాల్లో చకచకా అవకాశాలు కొట్టేస్తున్నాడు. పాత్ర ఏదైనా నవ్వులు పూయిస్తూ క్లాప్స్ కొట్టించేస్తున్నాడు.తన మాటలతోనే అందరిని మాయ చేస్తాడు ప్రియదర్శి.

ప్రియదర్శి త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు అని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.తాను తన చిన్ననాటి స్నేహియురాలు రిచా తో ఆగ్రాలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ నెల 23వ తేదీన ఆయన వివాహం జరగనుంది. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లోని నరేన్ గార్డెన్స్ లో భారీస్థాయిలో రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు.

టాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖులు మాత్రమే వివాహానికి హాజరవుతారు. మిగిలిన వారందరు రిసెప్షన్ కి హాజరవుతారని సమాచారం. టాలీవుడ్ లో మరొకరు తొందర్లో భ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు.