ఎన్టీఆర్ అంటే భయపడుతున్న భామ

జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం అంటే టాలివుడ్ హీరోయిన్లకు కత్తి మీద సామే. అందుకే కాబోలు ఎన్టీఆర్ సినిమాల్లో ఒకసారి కంటే ఎక్కువ సార్లు నటించిన హీరోయిన్లనే తీసుకుంటారు. ఎన్టీఆర్ తో సమంతా రెండు కంటే ఎక్కువ సినిమాలే చేసారు. కాజల్ అయితే దాదాపు 5 సినిమాల్లో ఎన్టీఆర్ తో ఆడిపాడింది. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ స్పీడ్ ని అందుకునే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉండటమే అంటారు టాలివుడ్ జనాలు.

ఎన్టీఆర్ నటన పరంగా ,డాన్స్ పరంగా ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు. ఎలాంటి డైలాగ్ అయినా సరే సింగల్ టేక్ లో చెప్పగల సామర్ధ్య౦ ఎన్టీఆర్ సొంతం..అలాగే ఎలాంటి స్టెప్ అయినా సరే అలవోకగా చేయగలరు ఎన్టీఆర్. ఇప్పుడు అదే ఒక హీరోయిన్ ని భయపెడుతుందట. ఆ భామ ఎవరో కాదు…ముకుందా సినిమాతో టాలివుడ్ కి వచ్చి..దువ్వాడ జగన్నాధం సినిమా తో ఇక్కడ సెటిల్ అయిపోయిన పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. అయితే తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యులో ఒక విషయాన్ని చెప్పింది ఈ భామ. ఎన్టీఆర్ అంటే భయమని ఎందుకన్నారు అనే ప్రశ్నకు గాను “ఇక్కడికి వచ్చాక ఆయన గురించి చాలావిన్నాను. ఎంత కష్టతరమైన సీన్‌ అయినా, డాన్స్‌ అయినా ఒక్కషాట్‌లో చేస్తారని చెప్పారు. అందుకే ఆయనతో డాన్స్‌అన్నా, సీన్‌అన్నా భయమేస్తోంది. నా వరకూ నేను బాగా ప్రాక్టీసు చేస్తున్నాను. ఆయనతో పోటీపడి చేస్తానని చెప్పను కానీ, సెట్‌లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలన్నదే నా ఉద్దేశమని చెప్పింది.