రచయిత మూవీ రివ్యూ..!

విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం “రచయిత”.దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు.సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న“రచయిత” చిత్రం ఈ రోజు విడుదలయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ..!

రచయిత అంటే హీరో కి తన మనసులోని భావాలను బయటపెట్టడానికి ఒక ప్రశాంతమయిన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ నవలలు రాయడం అలవాటు.ఆ నవల ల ద్వార మంచి రచయిత గా గుర్తింపు పొందుతాడు.అతని రాసే నవల లు అన్ని తన పాత్రలకు తగ్గటు మలచుకుని తన నిజ జీవితం లో జరిగిన సంఘటనలే రాయడమే ఈ సినిమా కథ.

అసలు సినిమా కథ విషయానికి వస్తే..హీరో అంటే విద్య సాగర్ ఒక అమ్మాయి ని మెదటి చూపులోనే ఇష్టపడుతాడు.ఆ అమ్మాయే పద్మావతి .పద్మావతి అంటే హీరొయిన్ (సంచిత పడుకోనే). .కానీ విషయమేమిటి అంటే పద్మావతి కి అప్పటికే పెళ్ళయిపోయి భర్త చనిపోతాడు.కానీ ఆ విషయం తెలియని హీరో ఆ అమ్మాయి ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి తను నవల లు రాసే ప్రదేశానికి తీసుకెళ్తాడు.ఇక అక్కడ ఎం జరిగింది…పద్మావతి తన భర్త ని మార్చిపోతుందా..హీరో కి ఆమెకి పెళ్ళయింది అన్న విషయం ఎలా స్పందిస్తాడు..అనేది సినిమా..పద్మావతి

రచయిత పాత్ర లో హీరో విద్యాసాగర్ చాల బాగా నటించాడు.పద్మావతి పాత్రా లో సంచిత తన నటన తో,అందం తో ప్రేక్షకులని ఆకట్టుకుంది.ఇక హిమజ కూడా తనదయిన శైలి లో రిపోర్టర్ పాత్రలో ఒదిగిపోయింది.నలుగు పాత్రా ల తో మాత్రమే సినిమా ని నడిపించాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్:

కరుణాకర్ డైలాగ్స్

హీరో డైలాగ్ చెప్పే విధానం,

హీరోయిన్ అందం,నటన,

హిమజ రొమాంటిక్ పాత్రా

గ్రాఫిక్స్ ,ఫోటో గ్రాఫి,

పాటలు,

దర్శకత్వం.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ అంత కొంచెం స్లోగా సాగి పోయే విధానం.

మొత్తం మీద ఇది ఒక చక్కటి అందమయిన సినిమా.

INS: రేటింగ్:3.5/5