రాఘవ కల నెరవేరింది !

నటుడు డాన్స్ మాస్టర్, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్‌కి రాఘవేంద్రస్వామి అంటే ఎంత భక్తో ఆయన గురించి తెలిసిన వారికి ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరం లేదు.

అయితే ఆయనకు మరో సద్గురువు అన్నా చాలా ఇష్టమట. ఆయనే షిర్డీ సాయిబాబా. ఆ ఇద్దరు గురువులను ఒకేచోట చూడాలన్నది ఆయన కల. అయితే రాఘవేంద్రస్వామి జయంతి సందర్భంగా ఆయన తన కలను నెరవేర్చుకున్నానని ఆయనే స్వయంగా తెలిపాడు ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తన అభిమానులకు సన్నిహితులకు వెల్లడించారు.

‘‘డియర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్!
ఈ రోజు గురు రాఘవేంద్ర స్వామి జయంతి. 5 అడుగుల సాయిబాబా విగ్రహాన్ని ఓపెనింగ్ కూడా నిర్వహించనున్నాం. ఇద్దరు గురువులను ఒకే ప్లేస్‌లో చూడాలన్నది నా కల. ఇవాళ నా కల నెరవేరుతోంది. ఇలాంటి పవిత్రమైన రోజున నేను మీ అందరూ మంచి ఆరోగ్యంతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తాను.’’ అని లారెన్స్ ట్వీట్ చేశారు.