ర‌జ‌నీ 2.0 ఫ‌స్ట్ రివ్యూ..!

rajini 2.O review,trendingandhra
 
రోబో 2.ఓకు ప్ర‌శంస‌ల వ‌ర్షం మొద‌లైంది. మొద‌టి రివ్యూగా దుబాయ్ నుంచి ఉమ‌ర్ సందు పెట్టిన ట్విట్ట‌ర్ పోస్టు చూడ‌గానే రోబో 2.ఓపై ఓ అంచ‌నాకు వచ్చేస్తున్నారు సినీ ప్రేక్ష‌కులు. వ‌న్ మిలియ‌న్‌కంటే ఎక్కువ‌గానే బుక్‌మై షోలో అమ్ముడుపోయాయట‌. ఎవేంజర్స్‌, బాహుబ‌లికంటే ఎక్కువేన‌ని ఉమ‌ర్ సందు ట్వీట్ చేశారు. ఇక సినిమా విష‌యానికొస్తే ర‌జ‌నీకాంత్ ఉమ‌ర్ సందు ర‌జ‌నీకాంత్ స్టైన్ ను పొగిడేశాడు. ఫ్యాన్స్  అస్స‌లు మిస్ అవ‌కండి అని చెప్పేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సైన్స్ ఫిక్ష‌న్ సినిమా రాలేద‌ని, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీకి రోబో సిరీస్ ఒక టెక్ట్స్ బుక్‌లాంటిద‌ని ఈ సినిమాను ఎవరు కూడా మిస్ అవ‌కూడ‌ద‌ని చెబుతున్నారు ఉమ‌ర్ సందు. 
 
అయితే, తెలుగు సినిమాకు భారీ త‌నం అద్దిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ సృష్టించిన అద్భుతం రోబో.  దీనికి సీక్వెల్‌గా 2.ఓ రూపొందింన విష‌యం తెలిసిందే.  సినిమా మొద‌లైన‌ప్ప‌ట్నుంచి ఎన్నో అడ్డంకులు విజ్ఞాలు దాటి రిలీజ్‌కు రెడీ అయింది. ప్రారంభంలో ర‌జనీకాంత్ కు ఆరోగ్యం బాగోక‌పోవ‌డంతో షూటింగ్ ఆల‌స్య‌మైంది. త‌రువాత విజువ‌ల్ ఎఫెక్ట్స్ చేసే సంస్థ హ్యాండివ్వ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇలా గ్రాఫిక్ష్ కోస‌మే ఏడాదిపాటు 2.ఓ వాయిదాల మీద వాయిదాలు ప‌డింది.
 
హాలీవుడ్‌ను త‌ల‌పించేలా రోబోను తీర్చిదిద్దాడు శంక‌ర్‌. ఇప్పుడు సీక్వెల్‌.. అంటే అంత‌కు మించి ఉంటేనే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న సంగ‌తి ఆయ‌న‌కు తెలుసు. త‌న‌దైన శైలిలో సందేశ‌మిస్తూనే టెక్నాల‌జీని పూర్తిగా వాడుకున్నాడు. రోబోలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ 20 శాతం ఉంటే 2.ఓ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి  45 శాతం గ్రాఫిక్స్‌తో నింపేశాడు. అలాగే, 4జీ సౌండ్ సిస్ట‌మ్‌ను ఫ‌స్ట్ టైమ్ ఇండియాలో 2.ఓతో ఇంట‌డ్యూస్ చేశారు. 
 
అలాగే, 2.ఓలో ఎవ‌రి క‌ష్టం వాళ్ల‌ది. చిట్టీగా క‌నిపించే ప్ర‌తీసారి ర‌జ‌నీకాంత్ ప్ర‌తీ రోజూ 12 కేజీలు ఉండే కాస్టూమ్‌ను ధ‌రించాడు. త‌న వ‌ల్ల డిస్ట‌ర్బ్ అయితే నిర్మాత‌కు కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌స్తుంద‌ని ఆరోగ్యం బాగోక‌పోయినా షూటింగ్‌లో పాల్గొన్నాడు సూప‌ర్‌స్టార్‌. ఇక అక్ష‌య్ కుమార్ క్యారెక్ట‌ర్ కాకిని పోలి ఉంటుంది. ఆ రూపం కోసం రోజూ మూడున్న‌ర గంట‌ల‌పాటు మేక‌ప్ రూములోనే గ‌డిపేవాడు. మేక‌ప్ తీసేందుకు గంట‌న్న‌ర ప‌ట్టేది.  మ‌రి ఇవాళ విడుద‌లైన ఈ సినిమా ఎన్ని రికార్డుల‌ను తిర‌గ రాయ‌నుందో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌ల‌పాటు వేచి చూడక త‌ప్ప‌దు.