ఆ ఇద్దరితో రకుల్

 

వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ తో టాలీవుడ్లో అడుగుపెట్టిన నటి రకుల్ ప్రీత్. తరువాత పెద్ద పెద్ద హీరోలతో మూవీస్ చేస్తూ స్టార్ ఇమేజ్ ని తన సొంతం చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్లో ఒకటీ అర మినహా పెద్దగా సినిమాలేం లేవు. కానీ అటు బాలీవుడ్ ఇటు తమిళ్ లో మూవీస్ చేస్తూ బిజీ అయ్యుంది ఈ భామ. ఎంత బిజీ అంటే షూటింగ్ కోసం రెండు నెలలుగా ఇండియా వైపు తిరిగి చూడనంత.

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అంటూ జూన్ లో లండన్ చెక్కేసింది. రకుల్ ప్రీత్ కి ఇప్పటి వరకైతే బాలీవుడ్ పెద్దగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు. ప్రస్తుతం రకుల్ ఆశలన్నీ ‘దేదే ప్యార్ దే’ పైనే ఉన్నాయి. మరోవైపు కోలీవుడ్‌కి చెందిన అన్నదమ్ములిద్దరితో రొమాన్స్ స్టార్ట్ చేసేసింది.

నెలరోజులు అజయ్‌తో సినిమా కోసం లండన్‌లో ఉండి ఆ సినిమా షెడ్యూల్‌ని పూర్తి చేసింది. అక్కడి నుంచి కార్తి సినిమా కోసం ఉక్రెయిన్ వెళ్లింది. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తి నటిస్తోన్న దేవ్ సినిమా షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకుని తాజాగా ఇండియాకు వచ్చింది రకుల్. ఇన్ని రోజులు తమ్ముడు తో రొమాన్స్ చేసిన రకుల్.. చెన్నై రాగానే సూర్య సినిమాతో బిజీ అయిపోయింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమా షూటింగ్ మరో కొన్ని రోజుల్లో పూర్తివుతుంది. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య-వెంకటేశ్ హీరోలుగా బాబీ తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్‌లో రకుల్ ను హీరోయిన్ గా తీసుకొన్నట్లు సమాచారం.