రామ్ చరణ్ కి నో చెప్పిన రకుల్

rakul preet singh , trendingandhra

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాకి వినయ విధేయ రామ అనే టైటిల్ ని అనుకుంటున్నారు . ఇక పోతే ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కోసం ఓ మంచి ఐటెం సాంగ్ ని బోయపాటి సెట్ చేశాడని సమాచారం . ఈ ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ని చిత్ర యూనిట్ సంప్రదించింది . ఇప్పటికే రకుల్ ప్రీత్ రెండు సినిమాలలో కలిసి నటించింది .

ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అడిగితే నో చెప్పిందని సమాచారం . చరణ్ సరసన ఆఫర్ అంటే ఎగిరి గంతేసి ఎంతో మంది హీరోయిన్లు ఉన్న ఈ సమయంలో , రామ్ చరణ్ పిలిచి మరీ అవకాశం ఇస్తే వద్దన్న రకుల్ ని అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు . మరో ముఖ్య విషయం ఏమిటంటే రకుల్ ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ గా లేదు , అలాంటప్పుడు చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అడిగితే వెంటనే చేయాలి కానీ రకుల్ మాత్రం ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదు . బోయపాటి ముందుగా ఈ సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా అనుకున్నాడు , కానీ అది కుదరలేదు కాబట్టి కనీసం స్పెషల్ సాంగ్ లో నైనా ఆమెను తీసుకోవాలని భావించాడు . దీన్ని రకుల్ చాలా సున్నితంగా తిరస్కరించింది. ఈ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో పెద్ద సంచలనంగా మారింది.

#RakulPreetRejectedToActWithRamCharanMovie #Boyapati #Rakul