నాకు నచ్చిందే నేను చేస్తా..మీకేంటి అభ్యంతరం..!

ఈ మధ్య స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,తనపై ప్రచారంలో ఉన్న పుకార్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా వాటిని తెరదించే ప్రయత్నం చేసింది.ఎవరు నమ్మినా నమ్మకపోయినా తనకు తాగుడు అలవాటు లేదని,అలాగే తను ఒక సినీ హీరోతో ప్రేమలో ఉన్నాను అనే ప్రచారాన్ని కూడా ఖండించింది.తను ఎవరినీ ప్రేమించడం లేదని,తను సింగిల్ అని ఈమె స్పష్టం చేసింది.తాజాగా ఇప్పుడు తన హాట్ పిక్స్ తో అభిమానులని హర్ట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తన అంధ,చందాలతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని దక్షిణాదిలో ఆడియెన్స్ కు దగ్గరయ్యింది.ఇప్పుడు బాలీవుడ్ లో ‘అయ్యారీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది.ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో బిజీగా ఉన్న రకుల్ మరోవైపు ఓ హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది.

‘మ్యాగ్జిమ్’ మేగజీన్ కవర్ పేజీ కోసం రకుల్ హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది.ఒక్కసారిగా రకుల్ ఇలా కనిపించేసరికి హర్ట్ అయిన అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడ్డారు.అనుచిత వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఇండియాటుడే ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన రకుల్,తన ఫొటో షూట్ పై కొందరు కామెంట్లు చేయగా,మరింకొందరు సానుకూలంగా స్పందించారని చెప్పింది.పాజిటివ్ కామెంట్లకు పొంగిపోవడం,నెగెటివ్ కామెంట్లకు కుంగిపోవడం తన నైజం కాదని తెలిపింది.

తన కెరీర్ లో ప్రముఖ మేగజీన్ కవర్ పై ఒక్కసారైనా మెరవాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుందని తనకు ఆ అవకాశం వచ్చిందని,వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను అని చెప్పింది. తాను చేసిన పని తనకు నచ్చిందని,ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని చెప్పింది.తన అమ్మానాన్నలకే లేని అభ్యంతరం వీరికెందుకని ఎదురు ప్రశ్నించింది.కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను తాను ఎన్నడూ ఎదుర్కోలేదని తెలిపింది.