చంద్రబాబుని పట్టిస్తే లక్ష రూపాయలు..రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ ..!

ram gopal varma , trendingandhra

తెలుగు సినీ ఇండస్ట్రీ లో వివాదాల తో ఎక్కువగా స్నేహం చేసే డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరెక్కించనున్నాడు . ఈ సినిమా ని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతొ తెరకెక్కిస్తున్నాడు . దసరా సందర్భంగా షూటింగ్ ని ప్రారంభించి , సంక్రాతి బరిలో నిలుస్తానంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ బయోపిక్ అంటే సినిమా పరంగాను , రాజకీయంగానూ చాలా కీలకమైన విషయాలు చెప్పాల్సిఉంటుంది

ఇక విషయానికొస్తే రాంగోపాల్ వర్మ కూడా ఇప్పుడు చంద్రబాబు పాత్ర కోసం సరైన నటుణ్ని వెతకడం మొదలుపెట్టాడు . ఇటువంటి సమయం లో ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పెట్టాడు. నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లానే ఉన్నారు. అతను ఏదో హోటల్ లో భోజనాలు వడ్డిస్తున్నారు.

‘ఈ వ్యక్తి ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఎవరైనా నాకు సహకరించగలరా? ఈయన ఆచూకీ తెలిపిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తా’ అంటూ ట్వీట్ చేశారు. ఎవరికైనా తెలిస్తే Laksmisntr@gmail.com మెయిల్ ఐడీకి వివరాలు పంపించాలని కోరారు . లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని జనవరి నెలాఖరులో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని రాంగోపాల్ వర్మ చెప్పారు.