లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతి ఎవరో తెలుసా …..!

ramgopal varma Latest Lakshmi's Movie, Trending Anhdra

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో అత్యంత కీలకమైన లక్ష్మీ పార్వతి పాత్రకు ముంబై మోడల్ రుపాలీ సూరిని వర్మ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ‘డ్యాడ్‌… హోల్డ్‌ మై హ్యాండ్‌’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన ఆమె నటనను చూసి వర్మ ఈ పాత్రకు రూపాలీని తీసుకున్నట్టు సమాచారం.

Related image

ఇటీవల తిరుపతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, సంక్రాంతి నాటికి సినిమాను సిద్ధం చేయాలన్నది వర్మ ఆలోచన. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేస్తున్నారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. చంద్రబాబు పాత్ర కోసం ఓ చిన్న హోటల్ కార్మికుడిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలే ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందనుంది.