నాన్న సినిమా ఆడకపోయినా పరవాలేదు-రామ్ చరణ్

నాన్న సినిమా ఆడకపోయినా పరవాలేదు-రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామచరణ్ నిర్మిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భగా ఈ చిత్రం టీజర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. స్వతంత్ర ఉద్యమ వీరుడు, బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన ఉగ్ర నరసింహుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్యం వహిస్తున్నాడు.

chiranjivi_ramcharan,TrendingAndhra

ఈ మూవీ టీజర్ చుసిన పత్రిక విలేకర్లు నిర్మాత రామ్ చరణ్ ని ఈ చిత్రానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అని అడిగారు. అప్పుడు రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఎంత ఖర్చు పెట్టానో చెప్పను, ఈ సినిమా వలన మాకు నష్టం వచ్చిన పరవాలేదు. ఈ సినిమాని లాభం కోసం చేయలేదు, ఇది మా నాన్న డ్రీం ప్రాజెక్ట్ అని అన్నారు. మా నాన్న కలను నేను నిజం చేస్తున్నందుకు నాకు చాల సంతోషంగా ఉంది అని అన్నారు.

ram-charan,TrendingAndhra