శ్రీదేవి బయోపిక్ ఫై స్పందించిన వర్మ

శ్రీదేవి బయోపిక్ ఫై స్పందించిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ..సిని ఇండస్ట్రీ లో వివాదాల దర్శకుడు గా ఒక మార్క్ సంపాదించుకున్నాడు వర్మ.ఇక శ్రీదేవి మరణం తో ట్వీట్ ల తో తన బాధను షేర్ చేసుకుంటున్నాడు వర్మ.
ఇక శ్రీదేవి ని అతిగా ఆరాధించి అభిమానించే వారి లో వర్మ ముందు ఉంటాడు.శ్రీదేవి అంటే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తాను దర్శకుడు అయ్యింది కూడా శ్రీదేవితో సినిమా తీసేందుకేనని చెబుతుంటాడు వర్మ.
ఇటీవల దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి కన్నుమూశారు . ఆమె మరణం వర్మను తీవ్రంగా కలచివేసింది. ఇక ఈ తరుణం లో వర్మ శ్రీదేవి బయోపిక్ ని తీయబోతున్నారు అనే టాక్ వచ్చింది.
కాగా బయోపిక్‌లను తీయడంలో సిద్ధహస్తుడైన వర్మ.. శ్రీదేవిపై కూడా ఓ బయోపిక్‌ను తీస్తున్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో వర్మ స్పందించారు. తాను శ్రీదేవి బయోపిక్‌ తీయడం లేదని స్పష్టం చేశారు. ‘శ్రీదేవి బయోపిక్‌ తీస్తున్నాన్నంటూ కొన్ని మీడియా వర్గాలు రాస్తున్న కథనాలు అవాస్తవం. ఆ ప్రయత్నం అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా ఆ పాత్రను పోషించగల నటి ఒక్కరూ లేరు’ అని క్లారిటీ ఇచ్చారు వర్మ.