రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడో తెలుసా ..!

టాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమా కు లేనంత పబ్లిసిటీ మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం మూవీ కి ఉంది. ఈ మూవీ పల్లెటూరి నేపథ్యం లో తీశారు, మెగాహీరో రామ్ చ‌రణ్ తేజ్ చిట్టి బాబుగా, చెన్నై బ్యూటీ స‌మంత రామలక్ష్మిగా నటిస్తున్నారు.పల్లెటూరి కథ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ రూపొందిస్తోన్న రంగస్థ‌లం సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడా అని ఎదురు చూస్తోన్న అభిమానులకు గుడ్ న్యూస్ అందుతోంది. ఈ వేడుకను వైజాగ్‌లో వచ్చేనెల 18న భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరవుతారని తెలిసింది.నాపేరు చిట్టిబాబు అండీ అంటూ రామ్ చరణ్ డైలాగులు చెబుతూ ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రామలక్ష్మి వచ్చేస్తోందంటూ సమంత పాత్రను మరో స్పెషల్ టీజర్ ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమా వచ్చేనెల 30న విడుదల కానుంది. ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఈ మూవీ లో ని మొదటి సాంగ్ ని రీలీజ్ చేస్తున్నారు.