ఫిబ్రవరి 14: ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం!

మేషం
ఆర్ధికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. షేర్లు క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఊహించని ప్రయాణాలు ఉంటాయి.

వృషభం
బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. క్లిష్ట సమయంలో కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ధనలాభం పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.

మిథునం

రుణ వత్తిడి నుంచి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ, కళా, పారిశ్రామికరంగాలవారి సన్మానాలు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు.

కర్కాటకం
మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు పదోన్నతలు లాంటి శుభవార్తలు వింటారు. కొత్తపనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. స్థిరాస్తిని కొనుగోలుచేయాలనే ప్రయత్నాలు నెరవేరతాయి.

సింహం
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంటాబయటా మీ మాటకు ఎదురుండదు. అన్ని విషయాల్లోనూ మీదే పైచేయిగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

కన్య
వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక వ్యవహారాల్లో స్వీయ నిర్ణయాలు వల్ల మేలు జరుగుతుంది. ధనలాభం ఉంది.

తుల
బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్తమిత్రులు పరిచయమవుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికం
ఆర్ధికలావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. దూరప్రాంతాల నుంచి అందిన ఓ వార్త కుటుంబమంతటా సంతోషాన్ని నింపుతుంది. వాహనయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబసభ్యులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కొందరు పదోన్నతులు లాంటి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మకరం
వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను కొంతవరకు అధిగమిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం కావడంతో ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కుంభం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

మీనం
జీవితభాగస్వామితో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.