టీడీపీకి రావెల గుడ్ బై వెనుక అస‌లు క‌థ ఇదే..!

Ravela original story behind goodbye to TDP, Trending Andhra
రైల్వే అధికారి అయిన రావెల కిశోర్ బాబు త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ప‌త్తిపాడు నుంచి పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రావెల కిశోర్‌బాబు అనంత‌రం అనూహ్యంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. 
 
అయితే, త‌ద‌నంత‌రం పార్టీలో, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌నితీరుప‌ట్ల వ్య‌తిరేక‌త రావ‌డంతో మంత్రి ప‌ద‌వి నుంచి చంద్ర‌బాబు త‌ప్పించారు. నాటి నుంచి రావెల కిశోర్‌బాబు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌ప్ప‌టికీ అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
Image result for ravela kishore babu
రావెల వైసీపీలో చేర‌తార‌ని మొద‌ల ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే, దీనిపై జ‌గ‌న్ నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌ని తెలుస్తోంది. దీంతో రావెల జ‌నసేన‌లో చేరాలని నిశ్చయించుకున్నారు. ప‌లుమార్లు త‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. రెండు మూడు సార్లు ప‌వ‌న్‌ను కూడా రావెల క‌లిసిన‌ట్టు తెలుస్తుంది. శుక్ర‌వారం గుంటూరులో త‌న అనుచ‌రుల‌తో సమావేశ‌మైన రావెల పార్టీ, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణయించారు. 
 
ఆ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను టీడీపీ కార్యాల‌యానికి పంపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో ఆయ‌న జ‌న‌సేన‌లో చేరుతార‌ని తెలుస్తోంది. అనంతపురం క‌వాతుకు వెళ్ల‌నున్న ప‌వ‌న్ శుక్ర‌వారం సాయంత్రం అమ‌రావ‌తికి చేరుకున్నారు. ఈ రోజు రావెల చేరిక కార్య‌క్ర‌మం త‌రువాత ప‌వ‌న్ అనంత‌పురం క‌వాతుకు వెళ‌తార‌ని చెబుతున్నారు.