బీజేపీలోనూ వార్ మొదలు… అదే కారణం

bjp,trendingandhra

తెలంగాణా ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ ప్రధాన పార్టీలతో పాటు తాను కూడా సత్తా చాటాలని ప్రయత్నం చేస్తుంది. కానీ క్యాడర్ బలంగా లేకపోవటం, ఉన్న వారిని నిరాశా నిస్పృహలు ఆవరించటం, పాత వారికి, డబ్బు ఖర్చు పెట్టగల వారికి మాత్రమే టికెట్లు కేటాయించటం బీజేపీ కి మైనస్ గా మారనున్నాయి. బీజేపీ నాయకుల్లో ముసలానికి కారణం అయ్యాయి.

bjp,trendingandhra
మొన్నటి దాకా టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేది తమ పార్టీనేనని చెప్పుకున్న బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ తో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందని తెలియటంతో మైలేజ్ పూర్తిగా పడిపోయింది. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి ఇంత కాలం ఎంతో మంది పార్టీ కోసం పని చేస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత కాపులకే టికెట్ ఇస్తున్నట్టు నేతలు చెప్తున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలోనూ అదే జరిగింది. దీంతో టికెట్ ఆశావహులు చాలా అసంతృప్తిలో ఉన్నారు. అభ్యర్థులకు పని చేసే పరిస్థితిలో లేరు.
బీజేపీ మొదటి జాబితాలో తాజాగా ప్రకటించిన పేర్లు అన్నీ గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి కొందరికి, అలాగే సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించారు.దీంతో ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. అంబర్‌పేట నుంచి బరిలోకి దిగుతున్న కిషన్‌రెడ్డికి, ముషీరాబాద్ నుంచి పోటీకి దిగుతున్న రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ కు కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్తునారు. గెలుపు అంత సులభం కాదని తేల్చి చెప్తున్నారు. .గోషా మహల్ నుంచి పోటీకి దిగుతున్న రాజాసింగ్‌కు కొంత మేరకు మద్దతు ఉంది. కాబట్టి ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉప్పల్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు కూడా ఆ పార్టీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమౌతుంది. గతంలో బీజేపీ పోత్తులతోనే సీట్లు గెలుచుకుంది. టీటీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ గ్రేటర్‌లో 15స్థానాలు గెలుచుకుంది. టీడీపీ పొత్తును విరమించుకొని ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న సమయంలో బీజేపీ కి కష్టకాలమే అనిపిస్తుంది.
ప్రచారంలో దూసుకుపోవాల్స్న చోట క్యాడర్ లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు లాభించావు అనిపిస్తుంది. ఒకపక్క అసమ్మతి నేతలు, మరోపక్క ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని జరుగుతున్న ప్రచారం, చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేకపోవటం వెరసి బీజేపే ఈ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటుంది. జాతీయ నాయకులు వచ్చి సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించినా ప్రయోజనం ఉండేలా లేదు. బీజేపీలో పుట్టిన అంతర్గత వార్ పార్టీ కి మరింత చేటు చెయ్యనుంది. .