గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

గూగుల్ తల్లి దయ అంటూ అందరూ ఏది కావాలన్నా గూగుల్ లో వెతికేస్తున్నారు.కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటుంటాం.అలాగే మనకు కావాల్సిన ఫోటోలను వెదికి సేవ్ చేసుకుంటుంటాం.ఇప్పుడు ఆ అవకాశం లేకుండా గూగుల్ వ్యూ ఆఫ్షన్‌ను తొలగించింది.

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌లో ఏవైనా ఫొటోలను ఓపెన్‌ చేసినప్పుడు దాని పక్కనే విజిట్‌,వ్యూ,షేర్‌ల ఆప్షన్‌లు కనపడేవి.అయితే ఇప్పుడు వ్యూ ఆఫ్షన్‌ను ఇకపై ఉండదు.దానిని తొలగించినట్లు గూగుల్ తెలిపింది.దీంతో యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను ఇక ఇష్టం వచ్చినట్లు సేవ్‌ చేసుకునే అవకాశం లేకుండాపోయింది.

కాపీ రైట్స్‌ కారణంగానే గూగుల్ ఈ ఆప్షన్‌ను తొలగించినట్టు తెలిసింది.తమ సెర్చింజన్‌లో కొన్ని మార్పులు చేశామని,వ్యూ ఇమేజ్‌ బటన్‌ను తొలగించేశామని గూగుల్ పేర్కొంది.యూజర్లకు,వెబ్‌సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఇలా చేశామని తెలిపింది.ఇక ఇమేజ్‌లు ఫుల్ సైజులో చూడాలంటే ఆ ఇమేజ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా చూడాలి.