జనసేన లోకి రిటైర్డ్ జడ్జి..!

ts rao , janasena , trendingandhra

గుంటూరుకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి టీఎస్ రావు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

janasena,trendingandhra

అనంతరం టీఎస్ రావు మాట్లాడుతూ.. పవన్ ప్రకటించిన విజన్ డాక్యుమెంటులోని అంశాలు, జనసేన ఏడు సిద్ధాంతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు అవసరమని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.

రైతు సమస్యలు, భూ సంస్కరణల అమలు తీరుపై తనకున్న అవగాహన, అనుభవాన్ని పార్టీ కోసం వినియోగిస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.