న‌గ‌రి వైసీపీ అభ్య‌ర్థి గా రోజా అవుట్‌..!

చిత్తూరు జిల్లా న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అధికార‌పార్టీ టీడీపీ అభ్య‌ర్థిపై ఇప్ప‌టికే దాదాపు క్లారిటీ వ‌చ్చేసింది. ఇక్క‌డి నుంచి 2014లో పోటీ చేసి కేవ‌లం 900 ఓట్ల తేడాతో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఇటీవ‌ల మృతి చెందిన విష‌యం తెలిసిందే.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న కుమారుడు భాను ప్ర‌కాష్ నాయుడుకు ఈ టికెట్‌ను ఇచ్చే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోం ద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇక్క‌డ గాలి ముద్దుకృష్ణ‌మ‌కు మంచి పలుకుబడి ఉండ‌డంతోపాటు ప్ర‌స్తుత ఎమ్మె ల్యే రోజాపై నెల‌కొన్న ఒకింత వ్య‌తిరేక‌త కూడా ప‌నిచేస్తుండ‌డంతో ముద్దు కుటుంబం నుంచి ఎవ‌రు ఇక్క‌డ పోటీ చేసినా గెలుపొంద‌డం త‌థ్యం అనే మాట వినిపిస్తోంది.

న‌గ‌రి నుంచి టీడీపీ అభ్య‌ర్థిపై క్లారిటీ దాదాపు వ‌చ్చేసింది. దీంతో మ‌రి ప్ర‌ధాన పోటీ దారు, వైసీపీ నుంచి ఎవ‌రు ఇక్క డ నుంచి బ‌రిలోకి దిగుతారు అనే విష‌య‌మే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. సిట్టింగ్ రోజాకు టికెట్ ఇవ్వొద్ద నేది ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు పార్టీ ఎన్నిక‌ల స‌ల‌హాదారు, ప‌రిశీల‌కుడు పీకే ఇచ్చిన నివేదిక‌లో స్ప‌ష్టం చేశాడు.

దీనిని బ‌ట్టి రోజాకు టికెట్ ఇవ్వ‌రాద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఓ ప‌ది రోజుల కింద‌టి వ‌ర‌కు ఈ టికెట్‌ను త‌న‌కే కేటాయించాల‌ని ప‌ట్టుబ‌ట్టిన రోజా గాలి మృతి త‌ర్వాత త‌న పంథాను మార్చుకుంది. త‌న‌కు ఇంకెక్క‌డైనా టికెట్ ఇవ్వాల ని ఆమె వైసీపీ వ్యూహ క‌ర్త‌ల ద‌గ్గ‌ర చెబుతూ వ‌స్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌న‌కు న‌గ‌రి సీటు వ‌ద్ద‌ని ఆమె కుండ‌బ‌ద్ద లు కొడుతోంది.

ఇప్పుడు గాలి ముద్దు ప్ర‌భావం, సింప‌తీ రెండూ ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రోజా నిల‌బ‌డినా గెలిచే ఛా న్స్ క‌నిపించ‌డం లేదు. పైగా గ‌త ఎన్నిక‌ల్లోనే చ‌చ్చీ చెడీ అష్ట‌క‌ష్టాలు ప‌డి గెలిచిన నేప‌థ్యంలో రోజా ఇక అక్క‌డ ఆశ‌లు వ‌దిలేసుకుంది. మ‌రి రోజా వ‌దులుకున్న మాత్రాన న‌గ‌రి నుంచి వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రూ పోటీ చేయ‌రా అంటే త‌ప్ప‌కుం డా పోటీ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీ అస్తిత్వానికే ప్ర‌శ్న‌.

అయితే, గాలి కి వ‌స్తున్న సానుభూతి, ఎన్నిక‌ల స‌ర‌ళి వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ప్పుడు మాత్రం కీల‌క‌మైన నేత‌ల‌ను అక్క‌డ దింపినా ఎలాంటి ప్ర‌యోజ‌నాలూ క‌నిపించ‌డం లేద‌ని భావిస్తున్న వైసీపీ అధినాయ‌క‌త్వం.

ఇక్క‌డి టిక్కెట్‌ని ఎవ‌రినైనా జూనియ‌ర్‌కు కేటాయించి మ‌మ‌ అని అనిపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తొంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఇంకా టికెట్ల విష‌యంపై దృష్టి సారించ‌నందున ఈ విష‌యం త్వ‌ర‌లోనే తేలుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.