#RRR ముహూర్తం ఫిక్స్ …!

rrr movie updates,tollywood top director rajamouli,rajamouli new movie rrr,ramcharan,ntr and rajamouli new movie,trendingandhra

దర్శకధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో వార్తలు ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. అయినా వేటికి సమాధానమివ్వని చిత్రయూనిట్.. అఫీషియల్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించింది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం ఓ స్పెషల్ తేదీన ప్రారంభం కాబోతోంది. 11-11-11న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 11వ నెల 11వ తారీఖు 11గంటలకు ఈ చిత్రానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ విడుదల చేసింది. ఇందులో ‘11 11 11’ అని చూపిస్తూ.. ఈ మూడు 11లు మూడు ‘R R R’లుగా మారడంను వీడియోలో చూపించారు.