RX 100 హీరో కార్తికేయ కొత్త సినిమా ప్రారంభం

RX 100 hero karthikeya new movie,karthikeya new movie,hero karthikeya new movie,hero karthikeya new movie updates,trendingandhra

చిన్న సినిమా గా వచ్చిన RX 100 మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. 15 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా చిన్న సినిమాలలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా తన స్పీడ్ ను పెంచేస్తూ ఒక ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఈ సినిమా కి సంబంధించి లుక్ ని ఈ మధ్య రిలీజ్ చేసారు. దీంట్లో కార్తెకేయ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ని తమిళ దర్శకుడు టి.ఎన్. కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు మొదలు కానుంది. విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘హిప్పీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ తో కార్తికేయ తమిళం లో కూడా క్రేజ్ సంపాదించాలని చూస్తున్నాడు. హిప్పీ కూడా హిట్ అయితే కార్తికేయ స్టార్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.